60 ఏళ్లు

ABN , First Publish Date - 2022-10-07T05:02:01+05:30 IST

విశ్వశాంతి కోసం 1962 పుట్టపర్తిలో భగవాన శ్రీ సత్యసాయిబాబా ప్రారంభించిన వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం 62 సంవత్సరాలు పూర్తిచేసుకుంది.

60 ఏళ్లు

1962లో సత్యసాయి ప్రారంభించిన వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం

దసరా నాటికి షష్ఠిపూర్తి

పుట్టపర్తి, అక్టోబరు 6

విశ్వశాంతి కోసం 1962 పుట్టపర్తిలో భగవాన శ్రీ సత్యసాయిబాబా ప్రారంభించిన వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం 62 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ప్రతి ఏటా దసరా వేడుకల్లో భాగంగా ఏడు రోజుల పాటు ఈ యజ్ఞం నియమనిష్టలతో నిర్వహిస్తారు. పూర్ణచంద్ర ఆడిటోరియంలో జరిగిన వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం బుధవారం పూర్ణాహుతితో ముగిసింది.  రుత్వికులు వేదమంత్రోచ్ఛారణల నడుమ 60వ యజ్ఞాన్ని ఘనంగా ముగించారు. యజ్ఞం పూర్తికాగానే రుత్వికులు యజ్ఞ పునీత జలాన్ని భక్తులపై చల్లారు. ఆఖరిరోజు వేలాదిమంది భక్తులు యజ్ఞంలో పాల్గొన్నారు. సాయంత్రం సాయికుల్వంత మందిరంలో విద్యార్థులు వేదపఠనం చేశారు. అనంతరం సత్యసాయి భక్తులు  గాన కచేరి నిర్వహించారు. గాయకులను సత్యసాయి  మేనేజింగ్‌ ట్రస్టు సభ్యులు ఆర్‌జే రత్నాకర్‌, చక్రవర్తి ఘనంగా సత్కరించారు. మహామంగళహారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందచేశారు. సర్వాంగ సుందరంగా సత్యసాయి మహాసమాధిని అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.



Updated Date - 2022-10-07T05:02:01+05:30 IST