ప్రజలపై పన్నుల భారం మోపడం దారుణం

ABN , First Publish Date - 2021-06-20T06:17:23+05:30 IST

కరోనా కష్టకాలంలో తీవ్ర ఇబ్బం దులుపడుతున్న ప్రజలపై పన్నుల బారం మోపడందారుణమని

ప్రజలపై పన్నుల భారం మోపడం దారుణం

-జనసేన నాయకుడు చిలకం మఽధుసూదనరెడ్డి

ధర్మవరంఅర్బన, జూన 19: కరోనా కష్టకాలంలో తీవ్ర ఇబ్బం దులుపడుతున్న ప్రజలపై పన్నుల బారం మోపడందారుణమని జనసే నపార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ రాష్ట్రసభ్యులు చిలకం మఽధుసూ దనరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం తన స్వగృహంలో విలేకరు లతో మాట్లాడారు. రాష్ట్రంలో పనులు లేక చేనేత, భవన కార్మికులు రోడ్డున పడటమేకాక కుటుంబపోషణ భారమైందన్నారు. .వీరికి తక్షణసాయం కింద రూ.10వేలు ఆర్థికసాయం అందించి ఆదు కోవాలని డిమాండ్‌ చేశారు. కరోనాతో తల్లిదండ్రులు కోల్పోయిన వారికి మాత్రమే రూ.10లక్షలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోందన్నారు. అలా కాకుండా కుటుంబంలో ఎవరూ చనిపోయిన రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇల్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతోందని, ఇసుకంత అధికార పార్టీ నాయకులే దోసుకుంటున్నారని మండిపడ్డారు. అదేవి ధంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు పెంచి పన్నులను తగ్గిం చాలని డిమాండ్‌ చేశారు.  అదేవిధంగా ఏ గ్రామాలకు వెళ్లిన రోడ్డులన్నీ గుంతలే కనబడుతు న్నా యని, ఏ ఒక్క రోడ్డు బాగుచేయలేదన్నారు. పం టల బీమా రాకుండా గ్రా మాలలో అధికార పార్టీనా యకులు రైతులను ఇబ్బం దులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా అధికార పార్టీనాయకులు చెప్పిన వారికే పథకాలు అందజేస్తున్నారని, ఇదిఇలాగే కొనసాగితే ఉద్యమాలు చేప డతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీపట్టణ అధ్యక్షుడు అడ్డగిరి శ్యాంకుమార్‌ పా ల్గొన్నారు.

Updated Date - 2021-06-20T06:17:23+05:30 IST