టెన్త్‌ జిల్లా నోడల్‌ అధికారిగా పురుషోత్తం

ABN , First Publish Date - 2022-04-10T06:07:00+05:30 IST

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఈ నెల 27 నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో నోడల్‌ అధికారిగా చిత్తూరు జిల్లా డీఈవో పురుషోత్తంను నియమిస్తూ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

టెన్త్‌ జిల్లా నోడల్‌ అధికారిగా పురుషోత్తం

చిత్తూరు (సెంట్రల్‌), ఏప్రిల్‌ 9: ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఈ నెల 27 నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు  జరుగనున్న నేపథ్యంలో నోడల్‌ అధికారిగా చిత్తూరు జిల్లా డీఈవో పురుషోత్తంను నియమిస్తూ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సహాయ నోడల్‌ అధికారిణిగా విద్యాశాఖ పరీక్షల విభాగం సహాయ కమిషనర్‌ ప్రభావతిని నియమించారు. ఈనెల 27 నుంచి మే 9వ తేదీ వరకు టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు జరగనున్నాయి. అనంతరం మే 13 నుంచి చేపట్టే మూల్యాంకనం (స్పాట్‌ వ్యాలేషన్‌) ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రంలో పీసీఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుపనున్నారు. దీంతో పరీక్షల విభాగం అధికారులు మూల్యంకనం చేయడానికి అవసరమైన డెస్క్‌లు, టీచర్ల విధుల కేటాయింపు, స్ట్రాంగ్‌ రూం నిర్వహణ తదితర ఏర్పాట్లపై దృషి ్టసారించారు.

Updated Date - 2022-04-10T06:07:00+05:30 IST