రేపటి నుంచి మార్కెట్‌లో పంటల కొనుగోళ్ళు

ABN , First Publish Date - 2020-08-09T07:41:44+05:30 IST

నగరంలోని వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం నుంచి మిర్చి, పత్తి, అపరాలు తదితర పంటలు కొనుగోళ్లు జరుగుతాయని..

రేపటి నుంచి మార్కెట్‌లో పంటల కొనుగోళ్ళు

ఖమ్మం మార్కెట్‌, ఆగస్టు8: నగరంలోని వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం నుంచి మిర్చి, పత్తి, అపరాలు తదితర పంటలు కొనుగోళ్లు జరుగుతాయని మార్కెట్‌ ఛైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, సెక్రెటరీ రుద్రాక్షల మల్లేశం తెలిపారు. కరోనా  నేపఽథ్యంలో వ్యాపారులు గతనెల 15 నుంచి మార్కెట్‌లో లావాదేవీలు నిలిపివేయాలని నిర్ణయించారు.


దీంతో సుమారు 25 రోజుల విరామం అనంతరం మార్కెట్‌లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం రైతులకు వానాకాలం పంట పనులు సాగుతున్నందున వారికి పెట్టుబడికి నగదు అవసరం దృష్ఠ్యా  లావాదేవీలు జరపాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు. శనివారం మార్కెట్‌ అధికారులు, దిగుమతి శాఖ సభ్యులు పెద్ద (అపరాల) యార్డులో  కొనుగోళ్ళకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. రైతులు మార్పును గ్రహించి మార్కెట్‌కు తమ పంటలను తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్‌ గ్రేడ్‌ టూ సెక్రెటరీ బజారు, దిగుమతి శాఖ అధ్యక్ష, కార్యధర్శులు దిరిశాల వెంకటేశ్వర్లు, బజ్జూరి రమణారెడ్డి మార్కెట్‌ సిబ్బంది వెంకటేశ్వర్లు, బబ్లూ  ఉన్నారు. 

Updated Date - 2020-08-09T07:41:44+05:30 IST