బద్వేలులో పురపోరు సందడి

ABN , First Publish Date - 2021-02-25T04:54:25+05:30 IST

బద్వేలు మున్సిపాలిటీలో ఎన్నికల సందడి మొదలైంది. మొత్తం 35 వార్డు ల్లో వైసీపీ అభ్యర్థులు అన్నింటా, టీడీపీ అభ్యర్థు లు 34 వార్డులకు నామినేషన్లు దాఖలు చేశారు.

బద్వేలులో పురపోరు సందడి

గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు

ఎన్నికల వ్యూహాలకు పదును

బద్వేలు, ఫిబ్రవరి 24: బద్వేలు మున్సిపాలిటీలో ఎన్నికల సందడి మొదలైంది. మొత్తం 35 వార్డు ల్లో వైసీపీ అభ్యర్థులు అన్నింటా, టీడీపీ అభ్యర్థు లు 34 వార్డులకు నామినేషన్లు దాఖలు చేశారు.  కాంగ్రెస్‌, బీజేపీ, వామపక్షపార్టీలు, మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రస్తు తం మార్చి 10న జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుని మున్సిపాలిటీపైన తమ పార్టీ జెండాలు ఎగురవేయాలని అటు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు.

పోటీలో ఉ న్న అభ్యర్థులను తప్పించేందుకు అఽధికార పార్టీ నేతలు బేరసారాలు చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ నేతలు  తమ అభ్యర్థులు చేజారిపోకుండా  పోటీలో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు ఎలాగై నా విజయం సాధించితీరాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. టీడీపీ నేతలు  ఎన్నికలపై ప్రత్యేక దృష్టిసారించారు. 

 ఇప్పటికే పోటీలో ఉన్న అభ్యర్థులు ఆయా వార్డుల్లో కలియతిరుగుతున్నారు. మున్సిపల్‌ ఎన్నికలపై సీరియ్‌సగా అఽధికార పార్టీవారు ఫోకస్‌ పెట్టారు. ఎన్నికల్లో  ఎలాగైనా తమ మద్ధతుదారులను గెలిపించుకోవాలన్న కసితో ఉన్నారు. ఎక్కడా కేడర్‌ చేయిజారకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. టీడీపీ శ్రేణులు ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

వార్డుల్లో ముఖ్య నేతలతో సమావేశ మై  ఎన్నికల్లో  విజయ దుందుభి మోగించి మున్సిపాలిటీని కైవశం చేసుకోవాలని ప్రణాళిక రచిస్తున్నారు.  ఇదేకోవలో  బీజేపీ, వామపక్షాలు, ఎవరికి వారు తమవారిని గెలిపించుకునేందుకు  తమతమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికలను టీడీపీ.వైసీపీ ప్రతిష్టాత్మంగా తీసుకుంటుండడ ంతో ఈ ఎన్నికలు రసతవత్తరంగా జరగనున్నాయి.

Updated Date - 2021-02-25T04:54:25+05:30 IST