Patiala కంచుకోటలో మాజీ సీఎం అమరీందర్ సింగ్ వెనుకంజ

ABN , First Publish Date - 2022-03-10T15:16:07+05:30 IST

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కుటుంబానికి కంచుకోట అయిన పాటియాలా అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన వెనుకంజలో ఉన్నారు....

Patiala కంచుకోటలో మాజీ సీఎం అమరీందర్ సింగ్ వెనుకంజ

పాటియాలా(పంజాబ్): పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కుటుంబానికి కంచుకోట అయిన పాటియాలా అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన వెనుకంజలో ఉన్నారు. గత ఏడాది అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని నెలకొల్పి, బీజేపీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. మాజీ కెప్టెన్ అయిన అమరీందర్ ఓట్ల లెక్కింపు తొలి రౌండ్‌లో పంజాబ్‌లోని పాటియాలాలో వెనుకంజలో ఉన్నారు. అనుభవజ్ఞుడైన నాయకుడు గత సంవత్సరం ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగాడు. ఈయన దశాబ్దాలపాటు కొనసాగిన కాంగ్రెస్‌ను విడిచిపెట్టి తన సొంత పార్టీని స్థాపించారు. రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసి అమరీందర్ సింగ్ వెనుకంజలో ఉన్నారు.

Updated Date - 2022-03-10T15:16:07+05:30 IST