ప్రధాని పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై షా స్పందన

ABN , First Publish Date - 2022-01-06T00:50:47+05:30 IST

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు.

ప్రధాని పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై షా స్పందన

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. భద్రతా వైఫల్యంపై పూర్తి నివేదిక అందించాలని పంజాబ్ అధికారులను ఆదేశించారు. భద్రతా వైఫల్యం సహించరానిదన్నారు. భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్ పార్టీ దేశానికి క్షమాపణ చెప్పాలన్నారు. పంజాబ్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ బటిండా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాక హెలికాఫ్టర్ ద్వారా వెళ్లేందుకు వాతావరణం అనుకూలించలేదు. దీంతో రోడ్డు మార్గం గుండా వెళ్లేందుకు యత్నించారు. ఆయన కాన్వాయ్ బటిండా ఫ్లై ఓవర్‌పైకి చేరుకోగానే ఆందోళనకారులు రహదారిని పూర్తి స్థాయిలో అడ్డుకున్నారు. 20 నిమిషాల పాటు వేచి చూసిన ప్రధాని తిరిగి వెనక్కు మళ్లి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.  

Updated Date - 2022-01-06T00:50:47+05:30 IST