చైనా, పాక్‌కు ముకుతాడు వేయాలి: కెప్టెన్ అమరీందర్

ABN , First Publish Date - 2020-08-15T21:30:42+05:30 IST

చైనా, పాకిస్థాన్‌ల నుంచి పొంచి ఉన్న సరిహద్దు ముప్పుపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ శనివారంనాడు దీటుగా..

చైనా, పాక్‌కు ముకుతాడు వేయాలి: కెప్టెన్ అమరీందర్

మొహాలి: చైనా, పాకిస్థాన్‌ల నుంచి పొంచి ఉన్న సరిహద్దు ముప్పుపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ శనివారంనాడు దీటుగా స్పందించారు. సరిహద్దుల్లో శత్రువుతో పోరాడేందుకు పంజాబ్ ఎప్పుడూ ముందుటుందని అన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.


'పాకిస్థాన్ ప్రతిరోజూ కాల్పులకు పాల్పడుతోంది. మరోవైపు చైనా స్నేహహస్తం చాస్తూనే మన దేశానికి ప్రమాదకారిగా నిలుస్తోంది. భారత సైనికులపై ఇటీవల చైనా బలగాలు పాశవిక దాడులకు పాల్పడింది. పాకిస్థాన్‌కు భారత్ ప్రతిసారీ గట్టి సమాధానమిస్తోంది. పాక్‌తో వ్యవహరించాల్సిన తీరు ఇదొక్కటే. ఇదే కఠినవైఖరి చైనా విషయంనూ వ్యవహరించాల్సిన అవసరం ఉంది' అని కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు.


స్వాతంత్ర్య పోరాటంలో లక్షలాది మంది భారతీయుల చేసిన త్యాగాలను, పోరాటాలను పంజాబ్ సీఎం గుర్తుచేసుకుంటూ, ఏ పోరాటం జరిగినా పంజాబీలు ఎప్పుడూ ముందే ఉంటారని అన్నారు. పంజాబ్ అమరవీరులను, వారి త్యాగాలను గుర్తుచేసుకోవడం, శత్రువుల నుంచి దేశాన్ని కాపాడేందుకు సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తున్న రక్షణ బలగాలకు సెల్యూట్ చేయాల్సిన సమయం ఇదని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో ప్రజల కడుపు నింపిన రైతన్నలు, కష్టకాలంలో ప్రజలకు సేవలందిస్తున్న ప్రభుత్వాధికారులను గుర్తించుకునే తరుణమిదని ఆయన అన్నారు.

Updated Date - 2020-08-15T21:30:42+05:30 IST