బెంగళూరులో పునీత్‌ విగ్రహం ఏర్పాటు చేస్తాం

ABN , First Publish Date - 2021-11-02T18:14:09+05:30 IST

పవర్‌స్టార్‌ పునీతరాజ్‌కుమార్‌ సంస్మరణార్థం రాజధాని బెంగళూరు నగరంలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ఉందని బీబీఎంపీ కమిషనర్‌ గౌరవ్‌గుప్త ప్రకటించారు. నగరంలో సోమవారం

బెంగళూరులో పునీత్‌ విగ్రహం ఏర్పాటు చేస్తాం

బెంగళూరు(Karnataka): పవర్‌స్టార్‌ పునీతరాజ్‌కుమార్‌ సంస్మరణార్థం రాజధాని బెంగళూరు నగరంలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ఉందని బీబీఎంపీ కమిషనర్‌ గౌరవ్‌గుప్త ప్రకటించారు. నగరంలో సోమవారం బీబీఎంపీ ఉద్యోగుల కన్నడ సంఘం ఆధ్వర్యం లో ఏర్పాటైన 66వ కన్నడ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు ఆ యన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కన్నడ పతాకాన్ని ఆవిష్కరించి పునీత్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. లక్షలాదిమంది హృదయాలలో చోటు సంపాదించుకున్నారన్నారు. ఇదే దిశలో బీబీఎంపీ కూడా పునీత్‌ గౌరవార్థం ఒక ప్రముఖస్థలంలో ఆయన విగ్రహాన్ని చేసేందుకు సన్నాహా లు ప్రారంభించిందన్నారు. ప్రభుత్వంతో చర్చించి త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పునీత్‌ నటనారంగం తోపాటు సామాజికసేవారంగంలోనూ హీరో అనిపించుకున్నారని ఆయన కొనియాడారు. బీబీఎంపీ పాల నాధికారి రాకేశ్‌సింగ్‌, ప్రత్యేక కమిషనర్‌ తులసి మద్దినేని తదితరులు ఈ సందర్భంగా హాజరయ్యారు. 


నియమావళిలో అవకాశం లేకపోవడం వల్లే పునీత్‌కు రాజ్యోత్సవ పురస్కారం ఇవ్వలేకపోయాం

  ప్రభుత్వ నియమావళి ప్రకారం మరణించిన వారికి రాజ్యోత్సవ పురస్కారాన్ని ప్రకటించేందుకు అవకాశం లేదని విద్యుత్‌, కన్నడ సాంస్కృతిక శాఖల మంత్రి వీ సునీల్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఉడుపిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కారణంగానే పవర్‌స్టార్‌ పునీత్‌కు రాజ్యోత్సవ పురస్కారం అందించలేకపోయామన్నారు. రానున్న రోజుల్లో పునీత్‌ సేవలను గుర్తించి ఆయనకు సముచిత గౌరవం దక్కేలా చూస్తామన్నారు.  పునీత్‌ పేరిట ఏదైనా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. దీపావళి పండుగ అనంతరం ప్రభుత్వం ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Updated Date - 2021-11-02T18:14:09+05:30 IST