రెండు లక్షల కొవిడ్ కేసులు నమోదైన తొలి జిల్లాగా పూణె రికార్డు

ABN , First Publish Date - 2020-09-09T00:21:53+05:30 IST

కొవిడ్ కేసుల్లో మహారాష్ట్రలోని పూణె రికార్డులకెక్కింది. రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదైన దేశంలోనే తొలి జిల్లాగా

రెండు లక్షల కొవిడ్ కేసులు నమోదైన తొలి జిల్లాగా పూణె రికార్డు

పూణె: కొవిడ్ కేసుల్లో మహారాష్ట్రలోని పూణె రికార్డులకెక్కింది. రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదైన దేశంలోనే తొలి జిల్లాగా రికార్డులకెక్కింది. మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కథనం ప్రకారం.. పూణె జిల్లాలో సోమవారం కొత్తగా 4,165 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,03,468కు పెరిగింది. ఆగస్టు 4న లక్ష కేసుల మార్కును దాటిన పూణె నెల రోజుల వ్యవధిలోనే మరో లక్ష కేసులకు చేరుకోవడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. 


ఢిల్లీలో సోమవారం నాటికి 1,93,526 కేసులు నమోదు కాగా, ముంబైలో 1,57,410 కేసులున్నాయి. పూణెలో కరోనా పాజిటివిటీ రేటు 22 శాతంగా ఉన్నట్టు కలెక్టర్ రాజేశ్ దేశ్‌ముఖ్ తెలిపారు. ప్రస్తుత గణాంకాలను బట్టి చూస్తూ కేసుల విషయంలో పూణె జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు.   


Updated Date - 2020-09-09T00:21:53+05:30 IST