‘ఆమ్ ఆద్మీ’పై పిడుగు: కూరగాయల తరువాత కొండెక్కిన పప్పుల ధరలు!

ABN , First Publish Date - 2020-09-29T16:40:37+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలో ఒకవైపు విజృంభిస్తున్న కరోనా కేసులు, మరోవైపు కొండెక్కుతున్న నిత్యావసర ధరలు... వెరసి ‘ఆమ్ ఆద్మీ’ ఫ్రభుత్వ ఆందోళనను మరింతగా పెంచుతున్నాయి.

‘ఆమ్ ఆద్మీ’పై పిడుగు: కూరగాయల తరువాత కొండెక్కిన పప్పుల ధరలు!

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఒకవైపు విజృంభిస్తున్న కరోనా కేసులు, మరోవైపు కొండెక్కుతున్న నిత్యావసర ధరలు... వెరసి ‘ఆమ్ ఆద్మీ’ ఫ్రభుత్వ ఆందోళనను మరింతగా పెంచుతున్నాయి. రెండు నెలలుగా కూరగాయల ధరలు రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు వివిధ రకాల పప్పుల ధరలు కిలోకు రూ. 15 నుంచి రూ. 20 వరకూ పెరుగుతూ వస్తున్నాయి. 



గత ఏదాది రూ. 70 నుంచి 80 వరకూ ఉన్నకిలో శనగపప్పు ధర ఇప్పుడు రూ. 100కు చేరుకుంది. అలాగే కందిపప్పు ధర కిలోకు రూ. 115గా ఉంది. ఈ నేపధ్యంలో నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ పప్పుదినుసుల సప్లయ్ పెంచాలని వ్యాపారులు కోరుతున్నారు. సప్లయ్ తగ్గిన కారణంగానే ధరలు పెరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. పండుగల సీజన్ సందర్భంగా డిమాండ్‌కు అనుగుణంగా సప్లయ్ ఉండాలని వారు సూచిస్తున్నారు. 

Updated Date - 2020-09-29T16:40:37+05:30 IST