పులిచింతల ఇన్‌ఫ్లో 1,88,010 క్యూసెక్కులు

ABN , First Publish Date - 2020-10-24T16:05:42+05:30 IST

పులిచింతలకు వరద ఉధృతి కొనసాగుతుండటంతో అధికారులు 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

పులిచింతల ఇన్‌ఫ్లో 1,88,010 క్యూసెక్కులు

సూర్యాపేట: పులిచింతలకు వరద ఉధృతి  కొనసాగుతుండటంతో అధికారులు 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ప్లో 1,88,010 క్యూసెక్కులు, అవుట్ ప్లో 1,74,480 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా...ప్రస్తుత నీటి నిల్వ 44.23 టీఎంసీలుగా నమోదు అయ్యింది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 175.89 అడుగులకు గాను... ప్రస్తుత నీటి మట్టం 174.014 అడుగులకు చేరింది. 

Updated Date - 2020-10-24T16:05:42+05:30 IST