మంత్రివర్గ ప్రమాణ స్వీకారం వాయిదా?

ABN , First Publish Date - 2021-05-11T14:16:26+05:30 IST

ఈనెల 7వ తేదీన పుదుచ్చేరి రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత ఎన్‌.రంగస్వామికి కరోనా వైరస్‌ సోకిన నేపథ్యంలో మంత్రివర్గ ప్రమాణస్వీకా

మంత్రివర్గ ప్రమాణ స్వీకారం వాయిదా?


అడయార్‌(పుదుచ్చేరి): ఈనెల 7వ తేదీన పుదుచ్చేరి రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత ఎన్‌.రంగస్వామికి కరోనా వైరస్‌ సోకిన నేపథ్యంలో మంత్రివర్గ ప్రమాణస్వీకారం వాయిదా పడే అవకాశం వుంది. కరోనా సోకిన రంగస్వామిని చెన్నైకు తరలించి, ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే.. ఈ కారణంగా పుదుచ్చేరి మంత్రివర్గ ప్రమాణస్వీకారంపై అనుమానం నెలకొంది. ఈనెల 7వ తేదీన ఆ రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌.. ముఖ్యమంత్రిగా ఎన్‌.రంగస్వామితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఒక్క మంత్రి కూడా ఆ రోజున ప్రమాణస్వీకారం చేయలేదు. అయితే, గత  రెండు రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతూ వచ్చిన రంగస్వామికి ఆదివారం కరోనా నిర్థారణ పరీక్షలు చేయింగా, అందులో కరోనా పాజిటివ్‌ అని తేలింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రంగస్వామి సేలం ఆలయానికి వెళ్ళారు. ఆ సమయంలో రంగస్వామి వెంట అత్యంత సన్నిహితంగా మెలిగే ఓ వ్యక్తి కూడా వెళ్ళారు. ఆయనకు కూడా కరోనా సోకింది. ఈ వ్యక్తిద్వారా ముఖ్యమంత్రికి కరోనా సోకివుంటుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే రంగస్వామి కుటుంబానికి చెందిన మరికొందరికి కూడా ఈ వైరస్‌ సంక్రమించినట్టు గుర్తించారు. ఇదిలావుంటే, ఈ నెల 14వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టాల్సివుంది. అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి రంగస్వామి ఆస్పత్రిలో వుండటంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కాగా, ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు పుదుచ్చేరి కూడా ఎన్నికలు జరిగిన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల ఫలితాలు ఈనెల 7వ తేదీన వెల్లడయ్యాయి. మొత్తం 30 స్థానాలు ఉన్న శాసనభలో ఎన్‌.రంగస్వామి సారథ్యంలోని ఎన్‌ఆర్‌కాంగ్రెస్‌ - బీజేపీ కూటమి 16 సీట్లను కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. స్వతంత్ర అభ్యర్థుల్లో ఐదుగురు విజయం సాధించారు. వీరిలో ఇద్దరుముగ్గురు సభ్యులు రంగస్వామి ప్రభుత్వానికి మద్దతు తెలిపే అవకాశం ఉంది. వీరికి కూడా మంత్రి పదవులు ఇవ్వొచ్చన్న వార్తలు వస్తున్నాయి. 

Updated Date - 2021-05-11T14:16:26+05:30 IST