పుచ్చలపల్లి సుందరయ్య నేటితరానికి ఆదర్శం

ABN , First Publish Date - 2022-05-20T04:42:06+05:30 IST

నేటితరం యువకులకు, రాజకీయ నేతలకు పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ఆదర్శమని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌ అన్నారు.

పుచ్చలపల్లి సుందరయ్య నేటితరానికి ఆదర్శం
పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న సీపీఎం నాయకులు

 వనపర్తి టౌన్‌, మే 19: నేటితరం యువకులకు, రాజకీయ నేతలకు పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ఆదర్శమని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌ అన్నారు. గురువారం పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతిని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో జరుపు కున్నారు. పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ  సుందరయ్య పేదల కో సం తన జీవితంలోని చివరి క్షణాల వరకు పోరాడిన వ్యక్తి అని, దేశంలో మార్కిజం, లెనినిజమే పేద ప్రజలకు న్యాయం చేస్తుందని బలంగా నమ్మి కమ్యూనిస్టు పార్టీలో చేరి పోరాటం సాగించారని అన్నారు. భూస్వాములకు ఎదురొడ్డి దున్నేవాడిదే భూమి అని నినదించి వేల ఎకరాలను పేదలకు పంచిన మహోన్నతుడు పుచ్చలపల్లి సుందరయ్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో పుట్ట ఆంజనేయు లు, లక్ష్మి, గోపాలకృష్ణ, కురుమయ్య, రాములు, రమేష్‌, ఉమామహేశ్వరాచారి, బాలస్వామి, బాలరా జు, పుల్లయ్య, సాయిలీల, రాజశేఖర్‌ పాల్గొన్నారు. 

టీజేఏసీ ఆధ్వర్యంలో.. 

పుచ్చలపల్లి సుందరయ్య  వర్ధంతిని టీజేఏసీ నాయకులు జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో గురువారం  జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలు వురు  పుచ్చలపల్లి సుందరయ్య సేవలను కొనియా డారు. కార్యక్రమంలో ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్‌, గిరిరాజాచారి, కృష్ణయ్య, సంగన మోని వెంకటయ్య, తగవుల వెంకటస్వామి, నంది మల్ల రాములు, నాగరాజు, భవానీ, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. 

పాన్‌గల్‌లో..

పాన్‌గల్‌ : మండలంలోని తెల్లరాళ్లపల్లి, తండా, రేమద్దుల గ్రామాల్లో గురువారం కామ్రెడ్‌ పుచ్చల పల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్యానాయక్‌, సర్పంచు శాంతమ్మలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు సుందరయ్య ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమం లో గిరిజన సంఘం నాయకులు సోమ్లానాయక్‌, క్రిష్ణనాయక్‌, చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూర్‌లో..

ఆత్మకూర్‌ : ఆత్మకూర్‌ బస్టాండ్‌ చౌరస్తాలో గురు వారం సీపీఎం జాతీయ కార్యదర్శి సుందరయ్య వర్ధంతి వేడుకలను ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిం చారు. ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సీపీఎం  ఆత్మ కూర్‌ మండల కార్యదర్శి శ్రీహరి మాట్లాడుతూ నె ల్లూరు జిల్లా నుంచి సీపీఎం పార్టీ తరపున పార్ల మెంట్‌ సభ్యుడిగా ఎన్నికై జిల్లా ప్రజలకు నిస్వార్ధ సేవలు అందించారని తెలిపారు. ఆయన ఆశయాల కు అనుగుణంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో నాగన్న, బాలకృష్ణ, వెంకటన్న, ఆంజనేయులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

 వీపనగండ్లలో..

వీపనగండ్ల : మండల కేంద్రంలో గురువారం   సుందరయ్య వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల  వేసి నివాళులర్పించారు. సీపీఎం మం డల కార్యదర్శి బాల్‌రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల కోసం నిస్వార్థ జీవితం గడిపిన మహనీయుడని ఆయన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో సీపీ ఎం మండల కార్యదర్శి వర్గ సభ్యుడు మురళి, సీని యర్‌ నాయకులు బాలస్వామి, ఆంజనేయులు, శాఖ కార్యదర్శి వెంకటేష్‌గౌడ్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా సహయ కార్యదర్శి ప్రవీణ్‌, ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు నవీన్‌, రైతులు రామకృష్ణ, వెంకటయ్య, శాంతిరెడ్డి, శేఖర్‌రెడ్డి, గోపి, మోహన్‌గౌడ్‌, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T04:42:06+05:30 IST