ప్రభుత్వ రంగ సంస్థలు ధారాదత్తం

ABN , First Publish Date - 2022-08-10T05:06:02+05:30 IST

ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ధారాదత్తం చేస్తోందని డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి ఆరోపించారు.

ప్రభుత్వ రంగ సంస్థలు ధారాదత్తం
ఆమదాలవలసలో గౌరవ యాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు


డీసీసీ అధ్యక్షురాలు సత్యవతి

ఆమదాలవలస: ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ధారాదత్తం చేస్తోందని డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి ఆరోపించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని  కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆజాదీకా గౌరవ యాత్రను మంగళవారం అక్కులపేట కూడలి నుంచి పట్టణంలోని గేటు నుంచి కృష్ణాపురం వరకు  నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో మహాత్మాగాంధీ,  ఇందీరాగాంధీ,   సర్వేపల్లి రాధాకృష్ణన్‌ తదితర  జాతీయ నాయ కుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళలర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ   స్వాతంత్ర సాధన, దేశాభివృద్ధిలో ప్రగతి సాధించిందని తెలిపారు. ప్రభుత్వరంగంలో  పరిశ్రమలు  నెలకొల్పితే కేంద్రలోన బీజేపీ ప్రభుత్వం  కార్పొరేట్‌ సంస్థలకు వాటిని కట్టబెడుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర బీసీసెల్‌ కన్వీనర్‌ సనపల అన్నాజీరావు, నాయకులు పైడి నాగభూషనరావు, అంబటి కృష్ణారావు, బొత్స రమణ, లఖినేని నారాయణరావు పాల్గొన్నారు.




 


Updated Date - 2022-08-10T05:06:02+05:30 IST