పాక్ ఆపధర్మ ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్!

ABN , First Publish Date - 2022-04-04T23:47:41+05:30 IST

జాతీయ అసెంబ్లీలో విపక్షాలన్నీ ఏకమై ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాయి. ప్రధాని సొంత పార్టీ పీటీఐ నుంచి కూడా అర డజను మందికి పైగా సభ్యులు ప్రతిపక్షాలతో చేతులు కలిపారు. అయితే ఇమ్రాన్ వారందరికీ షాకిచ్చారు..

పాక్ ఆపధర్మ ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్!

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో తారా స్థాయికి చేరుకున్న రాజకీయ సంక్షోభంతో ఆ దేశ జాతీయ అసెంబ్లీని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి రద్దు చేశారు. అనంతరం పాకిస్తాన్ ఆపధర్మ ప్రధానమంత్రి ఎవరనే దానిపై చర్చ మొదలైంది. కాగా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ పేరును ఆపధర్మ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీపుల్స్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ప్రతిపాదించింది. మరో 90 రోజుల్లో జాతీయ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పటి వరకు గుల్జార్ అహ్మద్‌నే పాక్ ఆపధర్మ ప్రధనిగా కొనసాగించాలని పీటీఐ భావిస్తోంది.


జాతీయ అసెంబ్లీలో విపక్షాలన్నీ ఏకమై ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాయి. ప్రధాని సొంత పార్టీ పీటీఐ నుంచి కూడా అర డజను మందికి పైగా సభ్యులు ప్రతిపక్షాలతో చేతులు కలిపారు. అయితే ఇమ్రాన్ వారందరికీ షాకిచ్చారు. జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసీం సురీ ఆదివారం అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించారు. విపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానం రాజ్యాంగానికి, పాకిస్తాన్‌ నిబందనలకు విరుద్ధమని ప్రకటించారు.

Updated Date - 2022-04-04T23:47:41+05:30 IST