రక్షణ కల్పించండి

ABN , First Publish Date - 2022-06-26T05:24:41+05:30 IST

నందిగాం మండలం కవిటి అగ్రహారం గ్రామ సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌ కరుకోల వాసుదేవరావుపై సర్పంచ్‌ బొమ్మాళి వరలక్ష్మీ భర్త, వైసీపీ నాయకుడు బొమ్మాళి గున్నయ్య దాడి చేయడాన్ని నిరసిస్తూ సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. శనివారం సాయంత్రం మండలంలోని వివిధ గ్రామ సచివాలయ ఉద్యోగులు విధులు ముగించుకుని పెద్దఎత్తున నందిగాం ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. విధుల్లో ఉండగా దుర్భాషలాడి.. దివ్యాంగుడైన డిజిటల్‌ అసిస్టెంట్‌పై దాడికి దిగడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇలా అయితే విధులు నిర్వహించలేమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని బాధ్యుడిపై చర్యలు

రక్షణ కల్పించండి
ఎంపీడీవోకు వినతిపత్రం అందిస్తున్న బాధితుడు, సచివాలయ ఉద్యోగులు

- డిజిటల్‌ అసిస్టెంట్‌పై దాడిని నిరసిస్తూ సచివాలయ ఉద్యోగుల ఆందోళన

- నందిగాం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు 

- వైసీపీ నాయకుడిపై కేసు నమోదు 

నందిగాం, జూన్‌ 25: నందిగాం మండలం కవిటి అగ్రహారం గ్రామ సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌ కరుకోల వాసుదేవరావుపై సర్పంచ్‌ బొమ్మాళి వరలక్ష్మీ భర్త, వైసీపీ నాయకుడు బొమ్మాళి గున్నయ్య దాడి చేయడాన్ని నిరసిస్తూ సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. శనివారం సాయంత్రం మండలంలోని వివిధ గ్రామ సచివాలయ ఉద్యోగులు విధులు ముగించుకుని పెద్దఎత్తున నందిగాం ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. విధుల్లో ఉండగా దుర్భాషలాడి.. దివ్యాంగుడైన డిజిటల్‌ అసిస్టెంట్‌పై దాడికి దిగడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇలా అయితే విధులు నిర్వహించలేమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని బాధ్యుడిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేస్తూ ఎంపీడీవో కె.ఫణీంద్రకుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం సచివాలయ ఉద్యోగులంతా బాధితుడు వాసుదేవరావుతో కలిసి నందిగాం పోలీస్‌స్టేషన్‌లో గున్నయ్యపై ఫిర్యాదు చేశారు. వారితో ఎస్‌ఐ మహ్మద్‌యాసిన్‌ గంటకుపైగా చర్చించారు. అనంతరం గున్నయ్యపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. 

 

 



Updated Date - 2022-06-26T05:24:41+05:30 IST