Abn logo
Apr 23 2021 @ 00:27AM

కొవిడ్‌ రోగులకు మెరుగైన సేవలు అందించాలి

- వ్యాక్సినేషన్‌, టెస్టుల సంఖ్య పెంచాలి 

- జిల్లా అసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్‌ 

సిరిసిల్ల, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రభు త్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొవి డ్‌ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోజువారీగా వ్యాక్సినేషన్‌, టెస్టుల సంఖ్యను పెంచా లని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అదేశించారు. గురువారం సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని తనిఖీ చేశారు. చికిత్స పొందుతున్న రోగుల నుంచి సదు పాయాలు ఏలా ఉన్నాయని ఆరా తీశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుప త్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్‌ రోగులకు మెరు గైన వైద్య సేవలు అందించాలని అదేశించారు. ఆసుపత్రి పై అంతస్తులో ఏర్పాటు చేసిన 60 బెడ్స్‌ కు సెంట్రల్‌ అక్సిజన్‌ లేన్‌ను అనుసంధానం చేసే ప్రక్రియను తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోజువారీ వ్యాక్సినేషన్‌ పెరగాలని, టెస్టుల సంఖ్యను పెంచా లని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ప్రస్తుతం ఆసుపత్రికి కొవిడ్‌ చికిత్సకు వస్తున్న రోగుల గురిం చి తెలుసుకున్నారు. అయన వెంట ఆసుపత్రి సూ పరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీధర్‌రావు ఉన్నారు. 


Advertisement
Advertisement