మా గ్రామానికి మౌలిక సౌకర్యాలు కల్పించండి

ABN , First Publish Date - 2022-08-10T06:15:39+05:30 IST

మాకు మౌలిక సదుపాయాలు కల్పించండి మహాప్రభో అంటూ మండలంలోని అవురువాడ పంచాయతీ శివారు పశువులబంద గిరిజనులు మంగళవారం అర్ధనగ్నంగా నిరసన వ్యక్తంచేశారు.

మా గ్రామానికి మౌలిక సౌకర్యాలు కల్పించండి
పశువుల బందలో అడ్డాకులు ధరించి మోకాళ్లపై నిరసన తెలుపుతున్న ఆదివాసీలు


పశువులబంద ఆదివాసీలు అర్ధనగ్నంగా నిరసన


మాడుగుల రూరల్‌, ఆగస్టు 9 : మాకు మౌలిక సదుపాయాలు కల్పించండి మహాప్రభో అంటూ మండలంలోని అవురువాడ పంచాయతీ శివారు పశువులబంద గిరిజనులు మంగళవారం అర్ధనగ్నంగా నిరసన వ్యక్తంచేశారు. మండలంలోని అవురువాడ పంచాయతీ శివారు సామాలమ్మకొండపై పశువులబంద గ్రామంలో ఆదివాసీలు ఏళ్ల తరబడి నివాసముంటున్నారు. గ్రామానికి రోడ్డు, విద్యుత్‌ సదుపాయం, అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాల, వైద్య సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. పిల్లలు పాఠశాలకు వెళ్లేందుకు కొండమార్గంలో పది కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తున్నదని, రేషన్‌ కోసం అదే పరిస్థితి అని అన్నారు. అనారోగ్యం చేస్తే డోలిపై ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తుందన్నారు. తమకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం గిరిజనులు అడ్డాకుల టోపీలు పెట్టుకొని అర్ధనగ్నంగా మోకాళ్లపై నిరసన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు గోవిందరావు, సీదరి కామేశ్వరరావు, నాయుడు, పీటీజీ సంఘం మండల కార్యదర్శి మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-10T06:15:39+05:30 IST