ఘనంగా 108 పైలట్‌ దినోత్సవం

ABN , First Publish Date - 2022-05-26T05:30:00+05:30 IST

ఘనంగా 108 పైలట్‌ దినోత్సవం

ఘనంగా 108 పైలట్‌ దినోత్సవం
కేక్‌ను కట్‌చేస్తున్న 108 పైలట్‌ సిబ్బంది

మేడ్చల్‌, మే 26 : మండల కేంద్రంలో గురువారం 108 ఈఎంఆర్‌ఐ ఫైలట్‌ సిబ్బంది ఎర్రోల్ల సతీష్‌ ఆధ్వర్యంలో 108 పైౖలట్‌ దినోత్సవాన్ని సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ను కట్‌చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఎర్రోల్ల సతీష్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఈఎంఆర్‌ఐ అంబులెన్స్‌ సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ.. ఎప్పటికప్పుడు ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ బాధితులను ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు వివరించారు. విపత్కర సమయాల్లో 108 అంబులెన్స్‌లో సమర్ధవంతంగా సేవలను అందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడటంలో పైలట్లు ముందుంటున్నట్లు వివరించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడంలో ఫైలట్ల పాత్ర కీలకమని ఆయన వెల్లడించారు.

Updated Date - 2022-05-26T05:30:00+05:30 IST