జీతాలు చెల్లించాలంటూ నిరసన

ABN , First Publish Date - 2020-06-02T10:08:28+05:30 IST

ఉపాధ్యాయులు, ఉద్యోగులకు మార్చి, ఏప్రిల్‌ నెలల జీతాల బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల

జీతాలు చెల్లించాలంటూ నిరసన

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక డిమాండ్‌


హయత్‌నగర్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు, ఉద్యోగులకు మార్చి, ఏప్రిల్‌ నెలల జీతాల బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తుర్కయంజాల్‌లో ఇబ్రహీంపట్నం ఆర్‌డీవో కార్యాలయం ముందు సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్‌డీవో అమరేందర్‌కు అందజేశారు. ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్‌ రంగారెడ్డి జిల్లా నాయకులు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, కాంగ్రెస్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి పాల్గొన్నారు.


ఉద్యోగులను ప్రభుత్వం పరోక్షంగా వేధిస్తోందన్నారు. హక్కుల కోసం పోరాటం చేసే ఉద్యోగులకు కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్ర జేఏసీ నాయకులు గాలయ్య, ఎన్‌. యాదగిరి మాట్లాడుతూ... ప్రభుత్వం మార్చి, ఏప్రిల్‌ వేతనాలను వాయిదా వేయడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు రాజమణి, ప్రవీణ్‌కుమార్‌, రాములయ్య, కల్పన, గోపాల్‌నాయక్‌, బాలకృష్ణ, బ్రహ్మచారి, పురుషోత్తంరెడ్డి, హయత్‌నగర్‌ మండల మాజీ అధ్యక్షుడు మల్‌రెడ్డి రాంరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-02T10:08:28+05:30 IST