పీఆర్సీపై నిరసన!

ABN , First Publish Date - 2022-01-20T05:32:32+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రకటించిన పీఆర్సీపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై నిరసనగా ఫ్యాప్టోలో ఉపాధ్యాయ సంఘాలు గురువారం కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు సన్నద్ధమవుతున్నాయి. పీఆర్సీపై ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ బుధవారం జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.

పీఆర్సీపై నిరసన!
సీతంపేట : జీవో పత్రాలను దహనం చేస్తున్న ఉపాధ్యాయులు

నేడు కలెక్టరేట్‌ను ముట్టడించనున్న ఉపాధ్యాయ సంఘాలు

గుజరాతీపేట/సీతంపేట, జనవరి 19: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు  ప్రకటించిన పీఆర్సీపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై నిరసనగా ఫ్యాప్టోలో ఉపాధ్యాయ సంఘాలు గురువారం కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు సన్నద్ధమవుతున్నాయి. పీఆర్సీపై ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ బుధవారం జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. పీఆర్సీ దారుణంగా ఉందని విమర్శించారు. సీతంపేట మండలంలో మల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు  ప్రభుత్వం ప్రకటించిన 23 శాతం ఫిట్‌మెంట్‌ను వ్యతిరేకిస్తూ జీవో కాపీలు  దహనం చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌, డీటీఎఫ్‌ రాష్ట్ర బాధ్యులు కె.కృష్ణారావు, రఘునందస్వామి  పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వం పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని కోరుతూ.. గురువారం కలెక్టరేట్‌ను ముట్టడించనున్నట్టు ఫ్యాప్టో జిల్లా జనరల్‌ సెక్రటరీ కొమ్ము అప్పలరాజు ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యా యులు, పెన్షనర్లు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అరెస్టులకు బెదరొద్దని ఫ్యాప్టోనేతలు  పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 

Updated Date - 2022-01-20T05:32:32+05:30 IST