పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై నిరసన

ABN , First Publish Date - 2021-06-20T05:43:05+05:30 IST

కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి దోచుకుంటోందని సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు మల్లేశం, జలాలొద్దిన్‌ విమర్శించారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై నిరసన

సంగారెడ్డి రూరల్‌/పుల్‌కల్‌/ నారాయణఖేడ్‌, జూన్‌ 19 : కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి దోచుకుంటోందని సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు మల్లేశం, జలాలొద్దిన్‌ విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం సంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట వామ పక్షాల నాయకులు ధర్నా నిర్వహించారు. పుల్కల్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద, తహసీల్దారు కార్యాలయం ఎదుట సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు పగడాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నారాయణఖేడ్‌ మండలంలోని నిజాంపేట వద్ద సంగారెడ్డి -నాందేడ్‌ - అకోలా 161వ జాతీయ రహదారిపై సీపీఎం డివిజన్‌ నాయకులు చిరంజీవి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

Updated Date - 2021-06-20T05:43:05+05:30 IST