దేశ ఔన్నత్యాన్ని కాపాడాలి

ABN , First Publish Date - 2022-08-11T05:48:49+05:30 IST

సందర్భం, ప్రాంతం ఏదైనా స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ దేశ ఔన్నత్యాన్ని ఎల్లవేళలా కాపాడుతామని భారతీయులంతా సంకల్పం స్వీకరించాలని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు.

దేశ ఔన్నత్యాన్ని కాపాడాలి
భువనగిరిలో మొక్కకు నీటిని పోస్తున్న కలెక్టర్‌ పమేలాసత్పథి

కలెక్టర్‌ పమేలాసత్పథి 

ఉత్సాహంగా  కొనసాగుతున్న స్వాతంత్య్ర వజ్రోత్సవాలు

భువనగిరి టౌన్‌, అగస్టు 10: సందర్భం, ప్రాంతం ఏదైనా స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ దేశ ఔన్నత్యాన్ని ఎల్లవేళలా కాపాడుతామని భారతీయులంతా సంకల్పం స్వీకరించాలని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం భువనగిరి మునిసిపల్‌ పరిధిలో ఆమె మొక్కలు నాటి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయతకు ప్రత్యేకగౌరవం, గుర్తింపు ఉందన్నారు. వజ్రోత్సవాల్లో జిల్లా వాసులంతా ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. వజ్రోత్సవాలకు గుర్తుగా  భువనగిరి వాసులంతా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు.ప్రతీఇంటిపై తిరంగా జెండా ఎగురవేసి స్వాతంత్య్ర సమరయోధులను స్మ రించుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ, మునిసిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌చైర్మన్‌ చింతల కిష్టయ్య, కమిషనర్‌బి.నాగిరెడ్డి, కౌన్సిలర్లు పంగ రెక్క స్వామి, బానోతు వెంకట్‌నర్సింగ్‌ నాయక్‌, గోపాల్‌, తదితరులు పాల్గొన్నారు. 


ఉత్సాహంగా కొనసాగుతున్న వజ్రోత్సవాలు

భువనగిరిలో వజ్రోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఎన్‌ఎ్‌సఎ్‌స ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ప్రిన్సిపల్‌ చిలుక రమణి, ఎన్‌ఎ్‌సఎ్‌స అధికారి అరుణ, లెక్చరర్లు, విద్యార్థులు మొక్కలు నాటారు. భువనగిరిలోని థియేటర్లలో ప్రదర్శించిన దేశభక్తి సినిమాలను పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా వీక్షించారు. అలాగే పట్టణంలో ని 35వార్డుల్లో ఆయా కౌన్సిలర్ల పర్యవేక్షణలో ఇంటింటికీ జాతీయ జెం డాలను పంపిణీ చేశారు. ఈమేరకు జాతీయ జెండాలను ఇళ్లపై ఎగురవేయడంతో ఆయా ప్రాంతాలు నూతన శోభను సంతరించుకున్నా యి. జాతీయ పతాకాలతో బస్తీలలో ర్యాలీలు నిర్వహించారు. కాగా గురువారం భువనగిరి హైదరాబాద్‌ చౌరస్తా నుంచి ఉదయం 6 గం టలకు నిర్వహించే 2కే ఫ్రిడమ్‌ రన్‌లో యువత పెద్దసంఖ్యలో పాల్గొనాలని పట్టణ ఇన్‌స్పెక్టర్‌ బి.సత్యనారాయణ కోరారు. 


పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు 

భువనగిరి రూరల్‌: పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. వనమహోత్సవం పురస్కరించుకుని మండలంలోని గౌస్‌నగర్‌ గ్రామంలో మొక్కలు నాటి నీళ్లుపోశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా 75 సంఖ్య ఆకృతి వచ్చేవిధంగా చెట్లను నాటి ఫ్రీడమ్‌ పార్కును ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ, డీపీవో ఆర్‌.సునంద, జడ్పీడిప్యూటీ సీఈవో బి శ్రీనివా్‌సరావు, అదనపు డీఆర్‌డీవో టి.నాగిరెడ్డి, ఎంపీడీవో గుత్తా నరేందర్‌రెడ్డి, ఎక్సైజ్‌ సీఐ నాగిరెడ్డి, సర్పంచ్‌ ఈర్ల పుష్ప తదితరులు పాల్గొన్నారు.  

భూదాన్‌పోచంపల్లి: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భం గా బుధవారం వనమహోత్సవం నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్‌ అన్నారు. పట్టణంలోని నారాయణగిరి వద్ద ఏర్పా టు చేసిన ఫ్రీడమ్‌ పార్కును మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివా్‌సతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర భావితరాలకు ఆదర్శప్రాయమన్నారు. వజ్రోత్సవాల సందర్భంగా ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీ, మునిసిపల్‌ కమిషనర్‌ ఎస్‌.భాస్కర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ బాత్క లింగస్వామియాదవ్‌, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T05:48:49+05:30 IST