ఎస్సీ కార్పొరేషన్‌ భూములను కాపాడండి

ABN , First Publish Date - 2022-05-28T05:12:53+05:30 IST

పేద దళితుల బతుకు దెరువు కోసం జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి పంపిణీ చేసిన భూములు అన్యాక్రాం తం కాకుండా కాపాడాలని ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ సభ్యులు డిమాండ్‌ చేశా రు.

ఎస్సీ కార్పొరేషన్‌ భూములను కాపాడండి
మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న తహసీల్దారు రమణి

కలికిరి, మే 27: పేద దళితుల బతుకు దెరువు కోసం జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి పంపిణీ చేసిన భూములు అన్యాక్రాం తం కాకుండా కాపాడాలని ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ సభ్యులు డిమాండ్‌ చేశా రు. శుక్రవారం స్థానిక రెవెన్యూ కార్యా లయంలో తహసీల్దారు రమణి అధ్యక్ష తన జరిగిన ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ కమిటీ సమావేఽఽశంలో సభ్యుడు శంకర గిరి మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్‌ కొనుగోలు చేసిన భూముల క్రయ విక్రయాలు, అన్యా క్రాంతం  తదితర  వివరాలు ఉన్నతాధికారులు అడిగినా పంపకుండా రెవెన్యూ అధికా రులు నెలల కొద్దీ కాలయాపన చేస్తున్నారని  విమర్శించారు. చిన్నమాలపల్లె దళితల కోసం కేటాయించిన శ్మశానం భూమిని గుర్తించి స్వాధీనం చేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని అంబేడ్కర్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం ఏసు రాజు సమావేశం దృష్టికి తెచ్చారు. ఆర్టీసీ బస్టాండు సమీపంలోని హిందూ శ్మశానవాటిక, తోపుకాడ దళితవాడ దగ్గరున్న శ్మశానవాటికలను ఉపాధి పథకంలో అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఎస్టీడీ హరి కోరారు. అందుకు ఎంపీడీవో వెంకటేశు సానుకూలంగా స్పందించారు. ఈ నెల 31న చిన్నమాలపల్లెలో కుల వివక్ష తపై సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎంపీపీ నూర్జహాన్‌, జడ్పీటీసీ పద్మజ,  ఏవో మమత, పోలీసు సిబ్బంది హాజరయ్యారు. 


Updated Date - 2022-05-28T05:12:53+05:30 IST