లాభదాయకంగా క్యారెట్‌ పంటసాగు

ABN , First Publish Date - 2022-05-22T05:30:00+05:30 IST

క్యారెట్‌ పంటల సాగు రైతన్నకు లాభదాయకంగా మారింది. ఇందులో భాగంగా మండలంలోని రెడ్డివారిపల్లి పంచాయతి పిట్టావాండ్లపల్లెకు చెందిన రైతు నాగరాజనాయుడు మొదటి సారిగా క్యారెట్‌ పంటను 3ఎకరాలలో సాగు చేశాడు.

లాభదాయకంగా క్యారెట్‌ పంటసాగు
గుబురుగా ఎదిగిన క్యారెట్‌ పంట

నిమ్మనపల్లె, మే 22: క్యారెట్‌ పంటల సాగు రైతన్నకు లాభదాయకంగా మారింది. ఇందులో భాగంగా మండలంలోని రెడ్డివారిపల్లి పంచాయతి పిట్టావాండ్లపల్లెకు చెందిన రైతు నాగరాజనాయుడు మొదటి సారిగా క్యారెట్‌ పంటను 3ఎకరాలలో సాగు చేశాడు. మామూలుగా రైతులు టమోట, వరిపంటలతో పాటు చిన్నపాటి పంటలను సాగు చేస్తుంటా రు. అయితే రైతు ఇతను వినూత్నంగా క్యారెట్‌ పంటను పండించి అధిక దిగుబడితో పాటు మంచి లాభాలను పొందుతున్నాడు.  ఎకరాకు క్యారెట్‌ విత్తనాలను కర్నాటకలో రూ.14500లతో కొనుగోలు చేసి స్పింక్లర్ల సహాయంతో 90రోజుల పంటను వేశాడు. ప్రస్తుతం దిగుబడి ఘననీయంగా వచ్చింది. క్యారెట్‌ కిలో 20 నుంచి 30 రూపాయలు పలుకుతుండడంతో ఎకరాకు 10 నుంచి 15 టన్నుల దిగుబడి వస్తుందని తెలిపారు. కేవలం మెట్ట ప్రాంతాలలో నీరు కొద్ది పాటిగా ఉన్నప్పటికి క్యారెట్‌ పంటను సాగు చేయచ్చని తెలిపారు. దాదాపు ఎకరాకు రూ.లక్ష వరకు ఖర్చు వస్తుందని పంట కోతదశలో కర్ణాటక నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారని విక్రయించేందుకు ఎలాంటి ఇబ్బంది పడనవసరం లేదన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో10టన్నులకు   దాదాపు 2నుంచి 3లక్షల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు.  మొదటిగా విత్తనాలు వేసే సమయంలో కర్నాటక వారే వచ్చి స్పింక్లర్లను ఏర్పాటు చేస్తారని అనంతరం 90రోజుల్లో పంట వస్తుందన్నారు. 

వినూత్న పద్ధతుల్లో పంట రక్షణ చర్యలు


మదనపల్లె టౌన్‌, మే 22: ఆరుగాలం కష్టపడి పండించిన టమోటా పంటను కాపాడుకునేందుకు గ్రామాల్లో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రాత్రిళ్లు దొంగలొచ్చి పొలాల్లో టమోటాను దొంగిలించిన సంఘటనలు కోకోల్లలు. వీటితో పాటు చెట్లపై గువ్వలు వాలి టమోటాలకు  ముక్కులతో కొరికి వదిలేస్తున్నాయి. దీంతో రైతులు అప్రమత్తమవుతున్నారు. గువ్వలను అదిలించేందుకు గతంలో రేకు డబ్బాలను కర్రతో కొడుతూ శబ్దాలు చేసేవారు. ఇప్పుడు రైతులు నూతన ఒరవడి తీసుకొచ్చారు. వీధి వ్యాపారులు ఉపయోగించి మిని బ్యాటరి మైకులను కొనుగోలు చేసి, గట్టిగా గువ్వలను తోలుతూ తమ మాటాలను రికార్డింగ్‌ చేశారు. చిత్ర విచిత్ర శబ్దాలు వచ్చేలా ఈ లౌడ్‌ స్పీకర్‌లో వినిపించే శబ్దాలతో గువ్వలు టమోటా పంటల జోలికి రావడం లేదు. దీంతో పాటు టమోటా తోటల పక్కనే వున్న చెట్ల కొమ్మలకు పాస్టిక్‌, రేకుల డబ్బాలు కడుతున్నారు. గట్టిగా వీచే గాలులలకు ఈ డబ్బాలు ఒకదానికి ఒకటి తగిలి వచ్చే శబ్దాలతో గువ్వలు, దొంగలు రాత్రిళ్లు పొలాల వద్దకు రావాలంటే జంకుతున్నారు.గుబురుగా ఎదిగిన క్యారెట్‌ పంట(ఇన్‌సెట్‌) క్యారెట్‌ దుంప

Updated Date - 2022-05-22T05:30:00+05:30 IST