జర్నలిస్టులపై వృత్తి పన్ను వేయడం దారుణం

ABN , First Publish Date - 2022-06-28T05:30:00+05:30 IST

సేవాదృక్పధంతో పనిచేస్తున్న జర్నలిస్టులపై రాష్ట్ర ప్రభుత్వం వృత్తి పన్ను వేయడం దారుణమని.... వెంటనే ఉపసంహరించు కోవాలని ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గౌనిపల్లె శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

జర్నలిస్టులపై వృత్తి పన్ను వేయడం దారుణం
రాయచోటిలో కలెక్టర్‌కు వినతి పత్రం ఇస్తున్న జర్నలిస్టులు

రాయచోటి(కలెక్టరేట్‌), జూన్‌ 28: సేవాదృక్పధంతో పనిచేస్తున్న జర్నలిస్టులపై రాష్ట్ర ప్రభుత్వం వృత్తి పన్ను వేయడం దారుణమని.... వెంటనే ఉపసంహరించు  కోవాలని ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గౌనిపల్లె శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల నుంచి వృత్తి పన్ను వసూలు చేయాలని జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఏపీయూడబ్ల్యుజే రాయచోటి తాలూకాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసంద ర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం ఆదాయ వనరులు చేకూర్చుకోవాలంటే మార్గాలు ఉన్నాయని, ఇలా చాలీచాలని బతుకులతో మేము కాలం వెల్లదీస్తుంటే.. తమపై దయ ఉంచాల్సింది పోయి పన్నులశాఖ నుంచి ఈమెయిల్‌ ద్వారా నోటీసులు పంపించడం దారుణమన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎలక్ర్టానిక్‌, ప్రింట్‌ మీడియా విలేకర్లకు కనీస వేతనాలు లేవన్నారు. కుటుంబ పోషణే బరువవు తున్న నేపథ్యంలో జర్నలిస్టులు కూడా ప్రభుత్వానికి వృత్తి పన్ను కట్టాలనడం ఇంతవరకు ఎన్నడూ చూడలేదన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ పీఎస్‌ గిరీషాకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యుజే సభ్యులు కే.మేఘశ్యాం, రషీద్‌, క్రిష్ణయ్య, పీవీ నాగయ్య, కుమార్‌, నాగభూషణ్‌రెడ్డి, శివయ్య, రాంప్రసాద్‌, భువనేశ్వర్‌రెడ్డి, మురళి, దర్బార్‌బాషా, సాయిరెడ్డి, కిశోర్‌ ఆచారి, వెంకటరెడ్డి, అంజి, చిన్న పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-28T05:30:00+05:30 IST