సమస్యలు పరిష్కరించాలని డీలర్ల వినతి

ABN , First Publish Date - 2020-10-23T11:33:43+05:30 IST

రేషన్‌ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని నిడదవోలు పట్టణ మండల రేషన్‌ డీలర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

సమస్యలు పరిష్కరించాలని డీలర్ల వినతి

నిడదవోలు, అక్టోబరు 22 : రేషన్‌ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని నిడదవోలు పట్టణ మండల రేషన్‌ డీలర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద డిప్యూటీ తహసీల్దార్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. లబ్ధిదారులు ఒక్కొక్కరు రెండుసార్లు వేలిముద్రలు వేయాల్సి రావడంతో పనిభారం పెరిగిందన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.కార్యక్రమంలో డీలర్లు రంగా రావు,పవన్‌కుమార్‌, మాణిక్యాలరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-23T11:33:43+05:30 IST