భక్తులకు దారేదీ?

ABN , First Publish Date - 2021-01-19T05:27:29+05:30 IST

కపోవ డం విమర్శలకు తావిస్తోంది. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవమైన శంబర పోలమాంబ జాతరకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఏడాది పొడవునా వేలాది మంది భక్తులు అమ్మ వారిని దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, చత్తీస్‌గడ్‌ నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఏటా జాతర మహోత్సవం వేడుకగా సాగుతుంది. దేవదాయ శాఖకు రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతుంది. కానీ వసతులు సమకూర్చడంలో అటు ప్రభుత్వ, ఇటు అధికారులు విఫలమవుతున్నారు. శంబర గ్రామంలో అమ్మవారి చదురుగుడి జనావాసాల మధ్య ఉంటుంది. చదురుగుడి విస్తరణ చేపడతామని కొన్నేళ్ల కిందట ప్రకటించారు. కానీ

భక్తులకు దారేదీ?
దారుణంగా తయారైన ప్రధాన రహదారి




 జాతర సమీపిస్తున్నా వసతులపై దృష్టిపెట్టని అధికారులు
లక్షల్లో ఆదాయం..  అభివృద్ధి శూన్యం
మక్కువ:
శంబర పోలమాంబ ఆలయంలో అడుగడు గునా సమస్యలు రాజ్యమేలుతున్నాయి. మరోవైపు జాతర సమీపిస్తున్నా యంత్రాంగంలో చలనం లేకపోవ డం విమర్శలకు తావిస్తోంది. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవమైన శంబర పోలమాంబ జాతరకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఏడాది పొడవునా వేలాది మంది భక్తులు అమ్మ వారిని దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, చత్తీస్‌గడ్‌ నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఏటా జాతర మహోత్సవం వేడుకగా సాగుతుంది.  దేవదాయ శాఖకు రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతుంది. కానీ వసతులు సమకూర్చడంలో అటు ప్రభుత్వ, ఇటు అధికారులు విఫలమవుతున్నారు. శంబర గ్రామంలో అమ్మవారి చదురుగుడి జనావాసాల మధ్య ఉంటుంది. చదురుగుడి విస్తరణ చేపడతామని కొన్నేళ్ల కిందట ప్రకటించారు. కానీ ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. చదురుగుడి ఇళ్ల మధ్య ఉండటం వలన అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు అసౌకర్యానికి గురవుతారు.

కానరాని మౌలిక వసతులు
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అమ్మవారి దర్శనం అనంతరం విశ్రాంతి తీసుకోవడానికి షెడ్లు ఏర్పాటు చేస్తామని గతంలో అధికారులు ప్రకటించినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో భక్తులు సమీప తోటల్లో వంటా వార్పు చేపట్టి సేదతీరుతుంటారు. అమ్మవారి చదురు గుడి వెనుక విశాలమైన భూమిని గతంలో దేవదాయశాఖ అధికారులు లీజుకు తీసుకు న్నారు. కానీ ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. చదురు గుడి సమీపంలో భక్తుల కోసం నిర్మించిన మరుగుదొడ్లు నిర్వహణ లేక పాడవుతున్నాయి. జాతర సమయంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టి..తరువాత గాలికొది లేస్తున్నారు. తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శంబర గ్రామంలో తాగునీటి ఎద్దడి ఉంది. సుదూర ప్రాంతంలోని గోముఖి నది నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,శంబర జాతరకు పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మీదుగా చేరుకోవచ్చు. కానీ దశాబ్దాల కిందట నిర్మించిన రహదారులు ప్రస్తుతం అధ్వానంగా మారాయి. ఏటా జాతర సమయంలో తాత్కాలిక మరమ్మతుల పేరిట గోతులు నింపి చేతులు దులుపుకుంటున్నారు.


Updated Date - 2021-01-19T05:27:29+05:30 IST