భారీ వర్షాలు.. పొంగిన వాగులు

ABN , First Publish Date - 2022-08-06T06:58:04+05:30 IST

ఏజెన్సీలో కుండపోత వర్షం కుర వడంతో కొండవాగులు ప్రమాద కరస్థాయిలో పొంగి ప్రవహించా యి.

భారీ వర్షాలు.. పొంగిన వాగులు

బుట్టాయగూడెం, ఆగస్టు 5 : ఏజెన్సీలో కుండపోత వర్షం కుర వడంతో కొండవాగులు ప్రమాద కరస్థాయిలో పొంగి ప్రవహించా యి. శుక్రవారం సాయంత్రం ఏజె న్సీని నల్లటి మేఘాలు కమ్మేశా యి. బుట్టాయగూడెం, కొయ్యల గూడెం తదితర మండలాల్లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఇటివలే భారీవర్షానికి కేఆర్‌ పురం, కన్నాపురం ప్రాంతాల్లోని పడమట, తూర్పు కొండవాగులు పొంగడంతో వాగులను దాటుతుండగా కారు, మనిషి ఒకరు కొట్టుకుపోయాయి. వారం వ్యవధిలోనే రెండో సారి కేఆర్‌ పురం పరిసర ప్రాంతాల్లో భారీవర్షం కురవడంతో తూర్పు కొండవాగు ప్రమాదకరస్థాయిలో ప్రవహించింది. పరిస్థితి గమనించిన రెవెన్యూ, సచివాలయం, పంచాయతీ సిబ్బంది వాగుకు అడ్డంగా నిలబడి రాకపోకలను నిలిపివేశారు. కార్యా లయాలు మూసివేసే సమయానికి వర్షం కురవడం వాగులు పొంగడంతో ఇళ్ళకు వెళ్ళే ఉద్యోగులు గంటల తరబడి వాగుల వద్దనే నిలిచుండిపోయారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పొంగిన వాగులు రాత్రి 8 గంటలకు తగ్గుముఖం పట్టాయి. వాగులు శాంతించాక జనాలు రాత్రిపూట ఇళ్ళకు చేరుకున్నారు.

Updated Date - 2022-08-06T06:58:04+05:30 IST