మత్స్యకారుల ఆర్థిక బలోపేతానికి కృషి

ABN , First Publish Date - 2021-04-12T05:30:00+05:30 IST

తీరప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం నుంచి తన వంతు కృషి చేస్తానని కందుకూరు శాసన సభ్యుడు మానుగుంట మహీధర్‌ రెడ్డి అన్నారు.

మత్స్యకారుల ఆర్థిక బలోపేతానికి కృషి
లబ్ధిదారులకు అయిల్‌ ఇంజన్‌ అందజేస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి

ఉలవపాడు, ఏప్రిల్‌ 12 : తీరప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం నుంచి తన వంతు కృషి చేస్తానని కందుకూరు శాసన సభ్యుడు మానుగుంట మహీధర్‌ రెడ్డి అన్నారు. మండలంలోని పెదపట్టపుపాలెం గ్రామంలో సోమవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారుల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయన్నారు. వాటిని అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. మండలం తీరప్రాంతంలో నీలి విప్లవం మొదలైందని ఒకప్పుడు రూ.2 వేలకు కొరగాని ఇసుక భూములు ఇప్పుడు రూ.40 లక్షల ధరకు హెచరీలు కంపెనీలు కొనుగోలు చేస్తుండటం విశేషమన్నారు. కరేడు ప్రాంతంలో భారీ నౌకల నిర్మాణ కేంద్రం కోసం ప్రతిపాదనలు పరశీలనలో ఉన్నట్లు చెప్పారు. అదేవిధంగా పెదపట్లపుపాలెం తీరప్రాంతంలో రూ.2 కోట్ల రూపాయలతో ఫిషింగ్‌ ల్యాండ్‌ జెట్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. సముద్రంలో చేపల వేట నిషేద సయమంలో ప్రతి కుంటుంబానికి రూ. 10 వేలు, చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల ప్రమాద భీమాను ప్రభుత్వం అమలుజేస్తోంద న్నారు. పోర్టు నిర్మాణం గుడ్లూరు మండలం కర్లపాలెం, మొండివారిపాలెంలో జరుగుతున్నప్పటికీ, అనుబంధ పరిశ్రమలు వాటి ప్రయోజనాలు ఈ ప్రాంత ప్రజల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయన్నారు. అనంతరం 29 మంది మత్స్యకారులకు అవుట్‌బోట్‌ మోటారు ఇంజన్లు అందజేశారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్‌ రెడ్డి, ఏడీ ఉషాకిరణ్‌, ఎఫ్‌డీవో సాయి వర్షిణి, తహశీల్ధార్‌ సంజీవరావు, ఎంపీడీవో రవికుమార్‌, సర్పంచ్‌ ఆవుల జయరాం, పంచాయతీ కార్యదర్శి మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.

జూన్‌ 14 వరకు చేపల వేట నిషేధం

ఉలవపాడు : సముద్ర మత్స్య సంపద పరిరక్షణార్ధం ఈ నెల 15 నుంచి జూన్‌ 14 వరకు 61 రోజులు సముద్రంలో చేపల వేట నిషేదమని సింగరాయకొండ ఎఫ్‌డీవో ఎస్‌వీఎస్‌ వర్షిణి తెలిపారు. మత్స్యకారులకు నిషేదాజ్ఞలు జారీచేసినట్లు ఎంపీడీవో రవికుమార్‌ చెప్పారు.  మండలంలోని తీరప్రాంత గ్రామ మత్స్యకారులు నిషేదాజ్ఞలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మత్స్య శాఖ హెచ్చరించింది. సంప్రదాయక పడవలు కలిగిన మత్స్యకారులు తీరప్రాంతం నుంచి 8 కి.మీ లోపు ప్రాదేశిక జలాలకు ఇవతల వేట చేసుకోవచ్చని సూచించింది.

Updated Date - 2021-04-12T05:30:00+05:30 IST