కోయగూడెం ఓసీపీ ప్రైవేటీకరణను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-08-17T05:30:00+05:30 IST

ఇల్లందులోని కోయగూడెం ఓసీపీని కేంద్ర ప్రభుత్వం అరబిందో ప్రైవేట్‌ కంపెనికి ఇచ్చిందని, దీనిని వెంటనే రద్దుచేసి సింగరేణే తీసుకోవాలని, లేకపోతే అన్నీ కార్మిక సంఘాలతో కలిసి ఆందోళన చేస్తామని ఏఐటీయూసీ ప్రధానకా ర్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య హెచ్చరించారు.

కోయగూడెం ఓసీపీ ప్రైవేటీకరణను రద్దు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీతారామయ్య

- ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య

గోదావరిఖని, ఆగస్టు 17: ఇల్లందులోని కోయగూడెం ఓసీపీని కేంద్ర ప్రభుత్వం అరబిందో ప్రైవేట్‌ కంపెనికి ఇచ్చిందని, దీనిని వెంటనే రద్దుచేసి సింగరేణే తీసుకోవాలని, లేకపోతే అన్నీ కార్మిక సంఘాలతో కలిసి ఆందోళన చేస్తామని ఏఐటీయూసీ ప్రధానకా ర్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య హెచ్చరించారు. బుధవారం స్థా నిక భాస్కర్‌రావు భవన్‌లో జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్య కర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. సింగరేణిలోని నాలుగు బ్లాకులను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే జాతీయ సంఘాలతో పాటు గు ర్తింపు సంఘం మూడు రోజుల పాటు సమ్మె చేయడం జరిగిం దని, అయినప్పటికీ కోయగూడెం ఓసీపీని కేంద్ర ప్రభుత్వం ప్రై వేట్‌ సంస్థకు అప్పజెప్పిందని, కోయగూడెం ఓసీపీ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌ కానీ స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. పక్కనే ఉన్న జార్ఖం డ్‌ రాష్ట్రంలో అక్కడి బొగ్గు బ్లాకులను ప్రైవేట్‌ వారికి ఇవ్వడానికి ప్రయ త్నిస్తే అక్కడి ముఖ్యమంత్రి సుప్రీం కోర్టులో కేసు వేసి అడ్డుకున్నారని చెప్పారు. సింగరేఇకి వచ్చిన లాభాలను మెడికల్‌ కళాశాలకు రూ.500 కోట్లు, భద్రాచలం వరద బాధితులకు రూ.1000 కోట్లు ఇచ్చి సంస్థ లా భాలను తక్కువగా చూపించే ప్రయత్నం యాజమాన్యం చేస్తుందన్నారు. పెన్షన్‌ పెంపుదల కోసం కృషి చేస్తామని, ప్రతి టన్ను బొగ్గు ఉత్పత్తిపై పెన్షన్‌ ఫండ్‌ జమ చేయడం కోసం 10వ వేజ్‌బోర్డు రూ.10 ఒప్పందం జరిగిందని, అదే విధంగా ఇప్పుడు 11వ వేజ్‌బోర్డులో రూ.5 పెంచడానికి కోల్‌ ఇండియా, సింగరేణి యాజమాన్యం అంగీకరించిందని చెప్పారు. సింగరేణిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జాతీయ సంఘాలతో పాటు గుర్తింపు సంఘాన్ని కలుపుకుని పోరాటం చేస్తామని, దీనికి కార్మికవర్గం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ నాయకులు అక్బర్‌ అలీ, చెప్యాల మహేందర్‌, కవ్వంపల్లి స్వామి, కనకరాజు, చీకటి అంజయ్య, సాయన్న, చంద్రశేఖర్‌, ప్రకాష్‌, దుర్గయ్య, రాజయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-17T05:30:00+05:30 IST