ప్రైవేట్‌ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి : డీఎంహెచ్‌వో

ABN , First Publish Date - 2021-04-17T06:42:55+05:30 IST

కరోనా వైద్యానికి అనుమతులు పొందిన ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమన్యాలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని లేనిచో నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో అన్నిమళ్ల కొండల్‌రావు హెచ్చరించారు.

ప్రైవేట్‌ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి : డీఎంహెచ్‌వో
సమావేశంలో పాల్గొన్న డీఎంహెచ్‌వో తదితర అధికారులు

నల్లగొండ అర్బన్‌, ఏప్రిల్‌ 16 : కరోనా వైద్యానికి అనుమతులు పొందిన ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమన్యాలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని లేనిచో నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో అన్నిమళ్ల కొండల్‌రావు హెచ్చరించారు. శుక్రవారం ఆయన జిల్లాకేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు, యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కొవిడ్‌ మహమ్మారిని నిర్మూలించి ప్రజలకు వై ద్య సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం జిల్లాలో 30 ప్రైవేట్‌ ఆస్పత్రులకు కరోనా చికిత్సకు అనుమతి ఇచ్చిందన్నారు. దీన్ని అలుసుగా తీసుకుని ప్రైవేట్‌ యాజమాన్యాలు రోగుల నుంచి అధిక డబ్బులు వసూలు చేసినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విపత్కర ప రిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు,  వై ద్యులు సేవా దృక్పథంతో ప్రజలకు సేవ చేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే టెస్టులు, చికిత్సలు చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు, యాజమన్యాల నిర్వాహకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T06:42:55+05:30 IST