‘స్పందన’ అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-09-27T05:15:45+05:30 IST

స్పందనలో ప్రజలు ఇచ్చే అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జేసీ అభిషిక్త్‌ కిషోర్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవన్‌లో సోమవారం ఆయన డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఆయన ఎదుట తమ సమస్యలను ఏకరువు పెట్టారు.

‘స్పందన’ అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి
స్పందనలో అర్జీదారులతో మాట్లాడుతున్న జేసీ కిషోర్‌

అధికారులకు జేసీ అభిషిక్త్‌ కిషోర్‌ ఆదేశం

ఒంగోలు (కలెక్టరేట్‌), సెప్టెంబరు 26 : స్పందనలో ప్రజలు ఇచ్చే అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జేసీ అభిషిక్త్‌ కిషోర్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవన్‌లో సోమవారం ఆయన డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఆయన ఎదుట తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ స్పందన అర్జీలు మళ్లీ రాకుడా వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ, పారిశుద్య సమస్యలపై అర్జీలు ఎక్కువగా వస్తున్నాయన్న ఆయన వాటిపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో చిన్న ఓబులేషు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ నారదముని, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



Updated Date - 2022-09-27T05:15:45+05:30 IST