ప్రిన్స్ చార్ల్స్‌కు ఆయుర్వేద వైద్యం.. క్లారిటీ ఇచ్చిన రాజకుటుంబం

ABN , First Publish Date - 2020-04-05T03:04:08+05:30 IST

బ్రిటన్ రాకుమారుడు కోలుకోవడం వెనుకు ఆయుర్వేదం, మోమియోపతి వైద్యం ఉందని బెంగళూరులోని ఓ ఆయుర్వేదం రిసార్ట్ ఇచ్చిన సలహాల వల్ల ఆయన త్వరగా కోలుకున్నట్టు తెలిపారు. దీనిపై తాజాగా బ్రిటన్ రాజకుటుంబం క్లారిటీ ఇచ్చింది.

ప్రిన్స్ చార్ల్స్‌కు ఆయుర్వేద వైద్యం.. క్లారిటీ ఇచ్చిన రాజకుటుంబం

లండన్: కరోనా బారిన పడ్డ ప్రిన్స్ చార్ల్స్ కోలుకుని స్వీయ నిర్భంధం నుంచి బయటకొచ్చారు. ఇటీవల ఆయన కరోనా రోగుల కోసం తాత్కాలికంగా నిర్మించిన ఓ ఆసుపత్రిని కూడా ప్రారంభించారు. అయితే బ్రిటన్ రాకుమారుడు కోలుకోవడం వెనుకు ఆయుర్వేదం, మోమియోపతి వైద్యం ఉందని, బెంగళూరులోని ఓ ఆయుర్వేదం రిసార్ట్ ఇచ్చిన సలహాల వల్ల ఆయన త్వరగా కోలుకున్నట్టు ఆయుష్ శాఖ మంత్రి ఇటీవల ప్రకటించారు. సదరు రిసార్ట్ యజమానే స్వయంగా తనతో ఈ విషయం చెప్పారని ఆయన అన్నారు. దీనిపై తాజాగా బ్రిటన్ రాజకుటుంబం క్లారిటీ ఇచ్చింది. బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీసెస్ అందించిన సలహాలు, వైద్య సూచనలు కారణంగానే ఆయన కోలుకున్నట్టు రాజకుటుంబం అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రిన్స్‌ చార్ల్స్ కోలుకోవడం వెనుక ఆయుర్వేదం, హోమియోపతి వైద్యం ఉందంటూ భారత్ నుంచి వెలువడుతున్న వార్తలు అవాస్తవమని ఆయన అన్నారు. 

Updated Date - 2020-04-05T03:04:08+05:30 IST