న్యూఢిల్లీ : కోవిడ్‌తో బాధపడుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్ చేశారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరిన గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి గురించి కూడా ప్రధాని అడిగి తెలుసుకున్నారు.