అఫ్ఘాన్‌ పరిణామాలపై ప్రధాని మోదీ సమీక్ష

ABN , First Publish Date - 2021-09-07T06:52:49+05:30 IST

అప్ఘానిస్థాన్‌లో పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉన్నతస్థాయి

అఫ్ఘాన్‌ పరిణామాలపై ప్రధాని మోదీ సమీక్ష

  • రాజ్‌నాథ్‌, షా, ధోబాల్‌తో సమావేశం
  • రోజువారీ సమీక్షకు విదేశాంగ శాఖ 
  • మంత్రి జైశంకర్‌ నేతృత్వంలో కమిటీ

 

న్యూఢిల్లీ, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): అప్ఘానిస్థాన్‌లో పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రక్షణ  మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంమంత్రి అమిత్‌షా, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ ధోబాల్‌ తదితరులు పాల్గొన్నారు. తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించడమా? భారత వైఖరి ఎలా ఉండాలి? అఫ్ఘాన్‌తో దౌత్య, వాణిజ్యపరమైన అంశాలేమిటి? అనే కోణంలో ఈ సమావేశం జరిగినట్లు సమాచారం.


తాలిబాన్ల సర్కారు ఏర్పాటయ్యే వేళ దాయాదీ దేశ నిఘా విభాగం(ఐఎ్‌సఐ) చీఫ్‌ కాబూల్‌లో ఉండడంపైనా చర్చించినట్లు తెలిసింది. అఫ్ఘాన్‌ గడ్డపై భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలకు తావు ఉండకూడదనేదే భారత్‌ ముందు నుంచి ఆశిస్తోంది. భారత్‌తో సత్సంబంధాలను కోరుతున్నట్లు తాలిబాన్లు ఇప్పటికే ప్రకటించారు.   ఈ నేపథ్యంలో అఫ్ఘాన్‌ పరిణామాలను రోజువారీగా సమీక్షించేందుకు విదేశాంగ మంత్రి జైశంకర్‌ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు సీనియర్‌ అధికారులు తెలిపారు. 


Updated Date - 2021-09-07T06:52:49+05:30 IST