అగ్ని ప్రమాదాల నివారణలో భద్రత కీలకం

ABN , First Publish Date - 2021-04-17T05:16:36+05:30 IST

అగ్ని ప్రమాదాల తీవ్రత తగ్గించడానికి భద్రతా పరికరాల నిర్వహణ కీలకమని కొవ్వూరు అగ్నిమాపక శాఖాధికారి కె.సత్యానందం అన్నారు.

అగ్ని ప్రమాదాల నివారణలో భద్రత కీలకం
కొవ్వూరులో ప్రయోగాత్మక అవగాహన

కొవ్వూరు, ఏప్రిల్‌ 16 : అగ్ని ప్రమాదాల తీవ్రత తగ్గించడానికి భద్రతా పరికరాల నిర్వహణ కీలకమని కొవ్వూరు అగ్నిమాపక శాఖాధికారి కె.సత్యానందం అన్నారు. వారోత్సవాలలో భాగంగా శుక్రవారం వేములూరు పుంతరోడ్డులోని అపార్ట్‌మెంట్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. అపార్ట్‌మెంట్‌లో ప్రమాదాలు జరిగినపుడు భద్రతా పరికరాలు ఉపయోగించే విధానం, వాటి పనితీరు వివరించారు. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలతో కరపత్రాలు పంపిణీ చేశారు. గ్యాస్‌ లీక్‌ అయి మంటలు ఎగసిపడినపుడు మంటలు ఏవిధంగా ఆర్పాలి అని ప్రదర్శన ద్వారా చేసి చూపించారు.


జంగారెడ్డిగూడెం: గ్యాస్‌ బండ్‌ ద్వారా జరిగే అగ్నిప్రమాదాలపై గృహి ణులు అవగాహన కలిగి ఉండాలని అగ్నిమాపక కేంద్ర అధికారి కె.రాముడు సూచించారు. పట్టణంలోని అపార్ట్‌మెంట్స్‌ వద్ద శుక్రవారం గృహిణులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వంట గదుల్లో గ్యాస్‌ బండ్‌ల ద్వారా గ్యాస్‌ లీకేజీ, మంటలు వ్యాపించినప్పుడు తీసుకునే జాగ్రత్తలు, ప్రమాద నివారణపై అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరిగినప్పుడు వాటి నివారణకు ప్రదర్శన చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో స్ధానికులు, అగ్నిమాపక కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T05:16:36+05:30 IST