లావునిపట్టా భూముల్లో రియల్‌ వ్యాపారాన్ని అడ్డుకోండి

ABN , First Publish Date - 2022-05-19T07:03:32+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ప్రభుత్వ భూ ములను కాపాడాలని అసైన్డ్‌భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఉంటే అధికార పార్టీకి చెందిన వారే అసైన్డ్‌భూముల్లో రియల్‌ వ్యాపారానికి తెరలేపారని నిరసిస్తూ నిర్మల్‌ పట్టణ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేశారు.

లావునిపట్టా భూముల్లో రియల్‌ వ్యాపారాన్ని అడ్డుకోండి
కలెక్టరేట్‌ ముట్టడిలో పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకులు

అక్రమ ప్లాట్ల దందాపై చర్యలు తీసుకోండి

సర్వేనెంబర్‌ 535లో వెంచర్‌ వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి..వినతిపత్రం అందజేత

నిర్మల్‌అర్బన్‌, మే 18 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ప్రభుత్వ భూ ములను కాపాడాలని అసైన్డ్‌భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఉంటే అధికార పార్టీకి చెందిన వారే అసైన్డ్‌భూముల్లో రియల్‌ వ్యాపారానికి తెరలేపారని నిరసిస్తూ నిర్మల్‌ పట్టణ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు నాందేడపు చిన్ను, పార్టీ సీనియర్‌ నాయకులు అయ్యన్నగారి పోశెట్టి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. అ నంతరం కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ... పట్టణంలోని వెంకటాపూర్‌ శివారులో ఉన్న 535 సర్వే నెంబర్‌లో 59 ఎకరాలకు గాను 32 ఎకరాలకు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌లు ఇచ్చారని, ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అసైన్డ్‌ భూముల్లో ఎన్‌వోసీలు ఎలా ఇచ్చారని ప్ర శ్నించారు. తాజాగా వెంకటాపూర్‌కమాన్‌ సమీపంలో మెయిన్‌రోడ్డు అనుకొని దర్జాగా లావుని పట్టాభూములు రియల్‌వెంచర్‌ వేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా అసైన్డ్‌భూముల పరిరక్షణకు చర్యలు తీసు కోవాలని ఆదేశాలు ఇస్తే ఇక్కడి అధికారులు మాత్రం అక్రమాలకు పాల్పడు తున్నారని ఆరోపించారు. ఇప్పటికే నిరుద్యోగ యువత తీవ్రంగా పెరిగిపో యిందని వారికి ప్రభుత్వ అసైన్డ్‌ భూములను కేటాయించి వారిని ఆదు కోవాలని కోరారు. కానీ ఇందుకు భిన్నంగా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ అసైన్డ్‌ భూములను గుర్తించి ఆ భూములకు నిరభ్యంతర పత్రాలు జారీ చేసి అక్రమ రియల్‌ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. త్వర లోనే సమాచార హక్కు చట్టం ప్రకారం 535 సర్వేనెంబర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తీసుకొని కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. తక్షణమే వెంకటా పూర్‌ శివారులో ఉన్న రియల్‌ వెంచర్‌ను అడ్డుకొని అసైన్డ్‌ భూమిని స్వాధీ నం చేసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో భూముల పరిరక్షణ కు న్యాయ పోరాటం చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మోహినుద్దీన్‌, జింకసూరి, చరణ, ఇతర నాయకులుపాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T07:03:32+05:30 IST