సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలకు అడ్డుకట్ట

ABN , First Publish Date - 2022-05-24T06:30:59+05:30 IST

పోలీస్‌ శాఖ రూపొందించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ ఎస్పీ దేవేందర్‌ అన్నారు.

సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలకు అడ్డుకట్ట
పవర్‌ పాయింట్‌ ద్వారా వివరిస్తున్న ఇంటెలిజెన్స్‌ ఎస్పీ దేవేందర్‌, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

ఇంటెలిజెన్స్‌ ఎస్పీ దేవేందర్‌ 

సైకాప్స్‌ అప్లికేషన్‌పై శిక్షణ

సూర్యాపేట క్రైం, మే 23 : పోలీస్‌ శాఖ రూపొందించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ ఎస్పీ దేవేందర్‌ అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి సైబర్‌ నేరగాళ్లు, డ్రగ్‌ అనుమానితుల నిర్వహణపై సోమవారం జిల్లాలోని పోలీస్‌ అధికారులకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇటీవల ఎక్కువగా డ్రగ్స్‌, సైబర్‌ నేరాలు జరుగుతున్నాయని తెలిపారు. వాటిని అరికట్టేందుకు కొత్తగా డ్రగ్‌ అఫెండర్స్‌ ప్రొఫైలింగ్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. దీని ద్వారా సైబర్‌ నేరాలను అదుపు చేయడం, దర్యాప్తు వివరాలను, సైబర్‌ నేరస్తుల వివరాలను యాప్‌లో పొందుపరచనున్నట్లు వివరించారు. దీంతో పాటు సైకా్‌ప్స(సైబర్‌ క్రైం అనాలసిస్‌ ప్రొఫైలింగ్‌ సిస్టమ్‌) అనే అప్లికేషన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలు చేస్తున్న నేరస్తుల వివరాలు అన్ని ఒకేచోట ఉంటాయన్నారు. ఈ అప్లికేషన్‌ను రాష్ట్రంలోని అన్నిపోలీ్‌సస్టేషన్లలో ఇంటర్‌నెట్‌ ద్వారా అనుసంధానం చేస్తున్నామన్నారు. దీంతో నేరస్తులు ఎలాంటి డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్నారు, వారిపై ఎన్ని కేసులు ఉన్నాయి, జీవన స్థితిగతులు, ఎక్కడ ఉంటున్నాడు అనే విషయాలు నమోదు చేస్తారని ఆయన వివరించారు. ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ కేసుల దర్యాప్తులో బాగా పని చేయాలని తెలిపారు. ఇతర జిల్లాలు, రాష్ర్టాల పోలీసులతో సమన్వయంగా పని చేయాలని ఆదే శించారు. కార్యక్రమంలో డీఎస్పీలు మోహన్‌కుమార్‌, రెహమాన్‌తో పాటు జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-24T06:30:59+05:30 IST