వ్యాక్సిన్ వేసుకుంటే రూ.2,000 ఇస్తానని చెప్పి.. యువకుడికి ఆపరేషన్.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-01-03T05:59:10+05:30 IST

ఓ దళిత యువకుడికి వ్యాక్సినేషన్ పేరుతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఈ ఘటన రాజస్ఠాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ నగరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉదయ్‌పూర్‌కు చెందిన కైలాశ్ గమేతీ అనే యువకుడు కూలీ పని...

వ్యాక్సిన్ వేసుకుంటే రూ.2,000 ఇస్తానని చెప్పి.. యువకుడికి ఆపరేషన్.. అసలేం జరిగిందంటే..

ఓ దళిత యువకుడికి వ్యాక్సినేషన్ పేరుతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఈ ఘటన రాజస్ఠాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ నగరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉదయ్‌పూర్‌కు చెందిన కైలాశ్ గమేతీ అనే యువకుడు కూలీ పని జీవనం సాగిస్తున్నాడు. తల్లిదండ్రులకు అతను ఏకైక సంతానం. ఇటీవలే అతనికి వివాహం కూడా అయింది. ఇంకా పిల్లలు లేరు.


డిసెంబర్ 29న కైలాశ్ రోజూ లాగే కూలీ పని కోసం ఇంటి నుంచి బయలు దేరాడు. ఊరి బయట బ్రిడ్జి నిర్మాణం పనులకు వెళ్లాడు. అక్కడ ఒక వ్యక్తి కైలాశ్‌ను కలిశాడు. అతని పేరు నట్వర్ సింగ్. వ్యాక్సిన్ వేయించుకుంటే.. రూ.2,000 ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో కైలాశ్ డబ్బు కోసం ఆశపడి నట్వర్ సింగ్ వెంట వెళ్లాడు. కైలాశ్‌ను నట్వర్ సింగ్ ఒక ఆస్పత్రికి తీసుకెళ్లాడు.


అక్కడ కైలాశ్‌కు డాక్టర్లు ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ తరువాత కైలాశ్ నిద్రపోయాడు. కైలాశ్ నిద్రలేచేసరికి అతనికి ఆపరేషన్ జరిగింది. అది కుటుంబ నియంత్రణ ఆపరేషన్. అంటే కైలాశ్ ఇక ఎప్పుడూ తండ్రి కాలేడు. ఈ విషయం కైలాశ్‌కు తెలీదు. కైలాశ్ కాస్త తేరుకున్నాక నట్వర్ సింగ్ అతడిని ఇంటి వద్దకు చేర్చి రూ.11,00 ఇచ్చి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఆపరేషన్ జరిగిన చోట.. నొప్పి ఉండడంతో కైలాశ్ డాక్టర్ వద్దకు వెళ్లాడు. అక్కడ అతనికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ గురించి తెలిసింది. దీంతో కైలాశ్ షాక్‌కు గురయ్యాడు. తనకు జరిగిన అన్యాయం గురించి తెలిసి అతను ఏం చేయాలో తోచక.. తల్లిదండ్రులతో విషయం చెప్పాడు.


కైలాశ్ తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నట్వర్ సింగ్ గురించి దర్యాప్తు చేస్తున్నారు. అతనిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. కైలాశ్ దళితుడు కావడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదైంది.


Updated Date - 2022-01-03T05:59:10+05:30 IST