ప్రతిష్ఠించిన గణపతి విగ్రహం
జమ్మలమడుగు రూరల్, నవంబరు 29 : పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద శ్రీప్రసన్నవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం వినాయక విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ కమిటీ వారు, నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో గణపతి హోమం, విగ్రహ ప్రతిష్ట తదితర ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు నిర్వాహకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ ఎంఎల్ నారాయణరెడ్డి, డి.వీరబ్రహ్మయ్య, రవిశంకర్, రామమూర్తి, ఓబులేసు, రవీంధ్రనాధ్‌ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.
హోమం చేస్తున్న దృశ్యం