తొమ్మిదిన్నరేళ్లపాటు అధ్యక్షుడిగా..

ABN , First Publish Date - 2020-02-11T12:02:56+05:30 IST

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిన్నరేళ్లు ఆయన అధ్యక్షుడిగా పని చేశారు. ఆ ఘనత కూడా ఉమ్మడి జిల్లాలో ఆయన

తొమ్మిదిన్నరేళ్లపాటు అధ్యక్షుడిగా..

డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన బాలసాని లక్ష్మీనారాయణ

ఉమ్మడి జిల్లాలో అరుదైన ఘనత సాధించిన ఏజెన్సీ వాసి


భద్రాచలం, ఫిబ్రవరి 10: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిన్నరేళ్లు ఆయన అధ్యక్షుడిగా పని చేశారు. ఆ ఘనత కూడా ఉమ్మడి జిల్లాలో ఆయన ఒక్కడికే దక్కింది. ఆయనే బాలసాని లక్ష్మీనారాయణ. భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని వెంకటాపురం మండలం మరికాలకు చెం దిన బాలసాని లక్ష్మీనారాయణ 1987 జూలై 20వ తేదీన తొలిసారిగా మరికాల సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో 1987 ఆగస్టులో డీసీఎంఎస్‌ చైర్మన్‌గా మూడేళ్లపాటు బాధ్యతలు నిర్వహించారు. 1991లో జరిగిన సొసైటీ ఎన్నికల్లో మరికాల నుంచి మరోసారి సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికైన బాలసాని 1994 వరకు పని చేశారు. కాగా 1994లో మూడో దఫా సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన 1995 ఆగస్టు 10న డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఐదేళ్లపా టు సొసైటీ పదవీకాలం ఉంది.


ఈ క్రమంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని డీసీసీబీ చైర్మన్ల పదవీకాలాన్ని నాలుగేళ్లపాటు పొడిగించడంతో బాలసాని లక్ష్మీనారాయణ 2004 మే వరకు బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో డా. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బాలసాని లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో వరుసగా 1995 నుంచి 2004 వరకు నిరాటంకంగా తొమ్మిదిన్నరేళ్లపాటు డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించే అరుదైన అవకాశం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయనకు దక్కింది. 

Updated Date - 2020-02-11T12:02:56+05:30 IST