President Election Results: ఆధిక్యంతో దూసుకెళ్తున్న ద్రౌపది ముర్ము.. తొలి రౌండ్‌లో మెజార్టీ ఎంతంటే..

ABN , First Publish Date - 2022-07-21T20:50:01+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో (President Election Results) ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు (Droupadi Murmu) 540 ఓట్లు, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు..

President Election Results: ఆధిక్యంతో దూసుకెళ్తున్న ద్రౌపది ముర్ము.. తొలి రౌండ్‌లో మెజార్టీ ఎంతంటే..

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో (President Election Results) ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు (Droupadi Murmu) 540 ఓట్లు, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు (Yashwant Sinha) 208 ఓట్లు పోల్ అయినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ (PC Mody) తెలిపారు. ముర్ముకు పోలయిన 540 ఓట్ల విలువ 3,78,000, యశ్వంత్ సిన్హాకు పోలయిన ఓట్ల విలువ 1,45,600గా ఆయన పేర్కొన్నారు. 15 ఓట్లు చెల్లనివిగా తెలిపారు. తదుపరి ప్రకటన కోసం వేచి ఉండాలని పీసీ మోడీ కోరారు. వీటిని తొలి రౌండ్ ఫలితాలుగా (First Round President Election Results) పేర్కొన్నారు.



ఈ ఫలితాల ట్రెండ్‌ను చూస్తే రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు నల్లేరుపై నడకగానే కనిపిస్తోంది. తొలి రౌండ్‌లో ఎన్డీయే అభ్యర్థి ముర్ము ఆధిక్యం కనబర్చడంతో బీజేపీ (BJP) శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఏపీలో అధికార వైసీపీ (YCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) కూడా ఎన్డీయే అభ్యర్థికే జై కొట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాను బలపరిచింది.

Updated Date - 2022-07-21T20:50:01+05:30 IST