సాగుకు సన్నద్ధం

ABN , First Publish Date - 2022-05-23T05:33:05+05:30 IST

సాగుకు సన్నద్ధం

సాగుకు సన్నద్ధం
పొలాన్ని చదును చేస్తున్న రైతు

  • వానకాలం ఫసల్‌కు రైతన్నల పొలంబాట

తాండూరు రూరల్‌, మే 22: మరి కొన్ని రోజుల్లో  వానకాలం సీజన్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో రైతన్న లు పొలాలను చదను చేసే పనిలో నిమగ్నమయ్యారు. పొలాల్లో ఉన్న కట్టెలు, పొదలుపుట్రా కూలీలతో  తీయి ంచడంతోపాటు వేసవి దుక్కులు దున్నుతున్నారు. మరికొందరు విత్తనాల సేకరణలో నిమగ్నమయ్యారు. వర్షా లు కురియగానే విత్తనాలు విత్తేందుకు సిద్ధమవుతున్నా రు. తాండూరు మండల పరిధిలో ప్రాజెక్టులేమీ లేకపోవడంతో 90శాతం మంది రైతులు వర్షాధార పంటలు సాగుచేస్తున్నారు. బోర్ల కింద కూడా అంతంత మాత్రం గానే సాగుచేస్తారు. మేలురకం విత్తనాలే వేసుకోవా లని, జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. సాగుకు సరిపడా సబ్సిడీ, నాన్‌సబ్సిడీ విత్తనాలు మార్కెట్‌లో సిద్ధంగా ఉంచామ ని పేర్కొన్నారు. తాండూరు మండలంలో 11,000 హె క్టార్ల భూమి పంటలకు అనువుగా ఉంది. పత్తి 1000 హెక్టార్లలో, కంది 7వేల హెక్టార్లలో, పెసర 800 హెక్టా ర్లు, మినుము 900 హెక్టార్లలో, సోయాబీన్‌ 300 హె క్టార్లలో వేసే అవకాశం ఉందని వ్యవసాయాధిరులు పేర్కొంటున్నారు. మిగతా తృణధాన్యాలు, ముతక పం టలు, కూరగాయ పంటలు సైతం సాగుచేసే వీలుం దని పేర్కొన్నారు. పంట ఏదైనా నేలకు తగ్గట్టు సాగు చేసుకోవాలని, నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చే యాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. తొలకరి వర్షాలు ప్రారంభం కానుండడంతో రైతులు పను లు చకచకా పూర్తిచేసేందుకు సామగ్రిని సిద్ధం చేసుకున్నారు. ఈసారి ప్రధానంగా పెసర, మినుము, కం ది, పత్తి, మక్కజొన్న, సోయాబీన్‌, జొన్న పంటల సా గుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. 


  • రైతులకు సబ్సిడీ విత్తనాలు అందజేయాలి : ఇస్మాయిల్‌, రైతు, మాజీ సర్పంచ్‌, మిట్టబాస్పల్లి

వానాకాలం సీజన్‌లో కంది, పెసర, మినుము, పత్తి లాంటి పంటలను విత్తుకునేందుకు ప్రభుత్వం రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలి. రెండు సంవత్సరాలుగా ఎలాంటి సబ్సిడీ విత్తనాలు ఇవ్వకపోవడంతో రైతులపై ఆర్థిక భారం పడుతోంది. విత్తనాలు విత్తే సమయంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడాలి. 


  • నాణ్యమైన విత్తనాలనే విత్తుకోవాలి : శ్రీనివాస్‌, ఏఈవో, బెల్కటూర్‌ క్లస్టర్‌

ప్రస్తుతం మార్కెట్‌లో కల్తీ విత్తనాలు వస్తున్నాయి.  నకి లీ విత్తనాల పట్ల రైతులు  అప్రమత్తంగా ఉండాలి. విత్త నాలు కొనే ముందు నాణ్యమైనవా? కావా? అని వ్యవసాయాధికారులను సంప్రదించి నిర్ధారించుకొని కొనాలి. ప్రస్తుతం ప్రభుత్వం పప్పు దినుసులు సాగు చేసుకోవాలని సూచనలు, సలహా లు ఇస్తోంది. అందుకే రైతులు కంది, మినుము, పెసర, సోయాబీన్‌ వంటి పంటలు వేసుకోవాలి.

Updated Date - 2022-05-23T05:33:05+05:30 IST