రెండు మునిసిపాలిటీల్లో ఎన్నికలకు సన్నాహాలు

ABN , First Publish Date - 2021-10-19T06:21:46+05:30 IST

జిల్లాలో కొండపల్లి, జగ్గయ్యపేట మునిసిపాలిటీల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

రెండు మునిసిపాలిటీల్లో ఎన్నికలకు సన్నాహాలు

కోర్టులోనే జగ్గయ్యపేట వివాదం.. ఎన్నిక జరిగేనా?

ఇరుపార్టీల్లోనూ అనాసక్తి  జూ కొండపల్లిలో అంతా ఓకే   


ఆంధ్రజ్యోతి, విజయవాడ : జిల్లాలో కొండపల్లి, జగ్గయ్యపేట మునిసిపాలిటీల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. జగ్గయ్యపేట మునిసిపాలిటీకి కోర్టు వివాదాల నేపథ్యంలో ఇంతకు ముందు ఎన్నికలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ మునిసిపాలిటీని 31 వార్డులుగా విభజించారు. దాదాపు 80 వేల జనాభా ఉంది. కోర్టులో వివాదం కొనసాగుతూనే ఉన్నా, ఎన్నికలకు సిద్ధం కావడం గమనార్హం. అయితే ఇక్కడ ఎన్నికల పట్ల వైసీపీ, టీడీపీ రెండూ నిరాసక్తతతో ఉన్నట్టు తెలుస్తోంది. కోర్టు వివాదం నేపథ్యంలో ఇక్కడ ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది సందేహమే. దీంతోపాటు కొత్తగా ఏర్పాటు చేసిన కొండపల్లి మునిసిపాలిటీ ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులూ లేవు. వైసీపీ, టీడీపీ రెండూ ఎన్నికల్లో తలపడాలనే భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మునిసిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉన్నాయి. ఈ రెండు మునిసిపాలిటీల్లో పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మంగళవారం పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయి. ప్రజా ప్రతినిధుల అభ్యంతరాలను స్వీకరించిన మీదట, 23న తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. 

Updated Date - 2021-10-19T06:21:46+05:30 IST