పోరుమామిళ్లలో ఘనంగా ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు

ABN , First Publish Date - 2022-08-19T04:31:04+05:30 IST

పోరుమామిళ్లలో ముంద స్తు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. గురువా రం పోరుమామిళ్లలోని లిటిల్‌ ఏంజిల్స్‌ స్కూల్‌లో చిన్నారులు శ్రీకృష్ణుడు గో పికల వేషధారణతో ఆకట్టుకున్నారు.

పోరుమామిళ్లలో ఘనంగా ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు
నృత్య ప్రదర్శన చేస్తున్న విద్యార్థులు

పోరుమామిళ్ల, ఆగస్టు 18: పోరుమామిళ్లలో ముంద స్తు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. గురువా రం పోరుమామిళ్లలోని లిటిల్‌ ఏంజిల్స్‌ స్కూల్‌లో చిన్నారులు శ్రీకృష్ణుడు గో పికల వేషధారణతో ఆకట్టుకున్నారు. విద్యార్థినుల సాంస్కృతిక కార్య క్రమాలు ఆకట్టుకున్నాయి. శుక్రవారం వేణుగోపాలస్వామి ఆలయం లో వేడుకలు నిర్వహిస్తున్నట్లు కమిటీ చైర్మన్‌ నరసింహులు తెలి పారు. శుక్రవారం ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు భగద్గీ త పారాయణ ప్రవచనాలు ఉంటాయన్నారు. దేవస్థాన ఆవరణలో ఉట్టి ఉత్సవం జరుగుతుందని ఈ పోటీల్లో విజేతలకు నగదు బహు మతులు అందజేస్తారన్నారు. సాయంత్రం ఉత్సవ విగ్రహాలతో నగ రో త్సవం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. 

ప్రొద్దుటూరులో....

ప్రొద్దుటూరు టౌన్‌, ఆగస్టు 18: వసంతపేటలోని సరోజిని హైస్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం కృష్ణాష్టమి సందర్భంగా విద్యార్థులు రాధాకృష్ణ వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కృష్ణాష్టమి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శివకుమార్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

నేడు కృష్ణాష్టమి వేడుకలు

ప్రొద్దుటూరు టౌన్‌/రూరల్‌, ఆగస్టు 18: స్థానిక అనిబీసెంట్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానంలో జన్మష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఇస్కాన్‌ భక్తుడు నిరంజన్‌ ప్రభు తెలిపారు. గురువారం ఇస్కాన్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ శ్రీలప్రభుపాద అమెరికాలో ఇస్కాన్‌ సంస్థను ప్రారంభించి భక్తి ప్రచారం చేశారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇస్కాన్‌ కేంద్రాల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘ నంగా నిర్వహిస్తామన్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు హరినామ సంకీర్తన, శ్రీకృష్ణ బలరాముల దివ్యదర్శనం, 7 గంటలకు గౌర హారతి, 10.30 గంటలకు శంకాభిషేకం, పుష్పాభిషేకం, ప్రసాదాల పంపిణీ ఉంటుందని, ప్రజలు పాల్గొనాలని ఆయ న కోరారు. మండలంలోని ఉప్పరపల్లెలోని సమర్థనారాయణస్వామి ఆశ్రమంలో శుక్రవారం జన్మాష్టమి నిర్వహిస్తారని ఆశ్రమ పీఠాధిపతి గోపాలస్వామి పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు జరిగే వేడుకల్లో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి జయప్రదం చేయాలని కోరారు.

Updated Date - 2022-08-19T04:31:04+05:30 IST