Abn logo
Jul 6 2020 @ 20:27PM

గర్భవతులు స్వీట్లు ఎక్కువగా తింటే విపత్తు ఇదే!

ప్రెగ్నెస్సీ సమయంలో తినే ఆహారం తల్లినీ, బిడ్డనీ కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. మరీ ముఖ్యంగా పంచదార ఎక్కువగా ఉండే పదార్థాలు వీలైనంత తగ్గించమని వారు సలహాలిస్తున్నారు. గర్భవతులు పంచదార తగ్గించి తినమని నిపుణులు ఎందుకు సలహాలిస్తున్నారో తెలుసుకోండి.  


షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల తల్లీబిడ్డా కూడా ఓబేసిటీ ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేయాల్సి వస్తుంది. పిల్లలు పుట్టే సమయానికే ఎక్కువ బరువు ఉండొచ్చు. పుట్టాక బరువు పెరగవచ్చు. ఓ స్టడీ ప్రకారం ఏడు ఎనిమిది ఏళ్లకే ఈ పిల్లలు బాగా ఎక్కువ బరువుతో ఉంటారని తెలుస్తోంది. తల్లులు ప్రెగ్నెంట్ సమయంలో స్వీట్స్ ఎక్కువగా తింటే పిల్లలకు చిన్నప్పుడే హాట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.  వాళ్లు మెటబాలిక్ ప్రాబ్లమ్స్‌ను ఫేస్ చేస్తారు.  ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తీయగా ఏమైనా తినాలనిపిస్తే పండ్లు తినడం మంచిది. పంచదార కలపకుండా పండ్ల రసం తీసుకోవచ్చు. లేదా బెల్లంతో చేసిన పదార్థాలు కూడా తినొచ్చు. ఓ స్టడీ ప్రకారం తల్లి షుగర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే అది పిల్లల తెలివితేటలపై ప్రభావం చూపిస్తుందని తెలుస్తోంది. 

Advertisement
Advertisement