మహాప్రాకార నిర్మాణానికి సహకరించాలని వినతి

ABN , First Publish Date - 2021-06-20T07:07:01+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానంలో నిర్మించనున్న మహాప్రాకార నిర్మాణానికి సహకరించాలని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివా్‌సకు దేవస్థాన కార్యనిర్వాహణాధికారి కె.నవీన్‌కుమార్‌, ఛైర్మన్‌ దుగ్గిరెడ్డి జయరెడ్డిలు వినతిపత్రం అందజేశారు.

మహాప్రాకార నిర్మాణానికి   సహకరించాలని వినతి
నారాయణస్వామి చిత్రపటాన్ని అందిస్తున్న దేవస్థాన కార్యనిర్వాహణాధికారి కె.నవీన్‌కుమార్‌, చైర్మన్‌ దుగ్గిరెడ్డి జయరెడ్డిలు

సీఎ్‌సపురం, జూన్‌ 19 : ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానంలో నిర్మించనున్న మహాప్రాకార నిర్మాణానికి సహకరించాలని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివా్‌సకు దేవస్థాన కార్యనిర్వాహణాధికారి కె.నవీన్‌కుమార్‌, ఛైర్మన్‌ దుగ్గిరెడ్డి జయరెడ్డిలు వినతిపత్రం అందజేశారు. విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రిని కలిశారు. కామన్‌ గుడ్‌ఫండ్‌ నుంచి మహాప్రాకార నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివా్‌సకు నారాయణస్వామి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన పాలకమండలి సభ్యులు మంచికంటి మధుసూదన్‌రావు, సీఎ్‌స.పురం సింగిల్‌విండో ఛైర్మన్‌ భైరెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T07:07:01+05:30 IST