ఘనంగా ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు
ABN , First Publish Date - 2022-08-19T04:39:57+05:30 IST
పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గురువారం ముందస్తు శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.
పొదలకూరు, ఆగస్టు 18 : పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గురువారం ముందస్తు శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో పాఠశాలలకు వచ్చారు. ఆయా పాఠశాలల ఆవరణలో ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టే కార్యక్రమం ఆకట్టుకుంది. ఉపాధ్యాయులు కృష్ణాష్టమి విశిష్టతను పిల్లలకు వివరించారు.